ఉన్నత ఉద్యోగానికి ఫెలోషిప్స్

Teach for India

పేద విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నవారికి నాణ్యమైన విద్య అందించడానికి టీచ్‌ఫర్‌ ఇండియా కృషి చేస్తోంది. విద్య ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడం ఈ ఫెలోషిప్‌ లక్ష్యం. వ్యవధి రెండేళ్లు. బోధనపై ఆసక్తి ఉన్న గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారు రెండు నుంచి పదోతరగతి విద్యార్థులకు ఆసక్తి ఉన్న సబ్జెక్టుల్లో బోధించాలి.

ముంబయి, ఫుణె, ఢిల్లీ, హైదరాబాద్‌, అహ్మదాబాద్‌, బెంగళూరు, చెన్నైల్లోని కొన్ని పాఠశాలల్లో ఈ సేవలు అందుతున్నాయి. ప్రతినెలా రూ.20,412 హెచ్‌ఆర్‌ఎ చెల్లిస్తారు. వ్యవధి తర్వాత పలు బహుళజాతి కంపెనీల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకున్న వారికి ఆన్‌లైన్‌లో గంట వ్యవధితో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఎంపికైతే ఫోన్‌ ఇంటర్వ్యూ 30 నిమిషాల పాటు ఉంటుంది. ఈ దశను దాటిన వారిని అసెస్‌మెంట్‌ సెంటర్‌కు ఆహ్వానిస్తారు. 5 నిమిషాలు బోధించాలి. గ్రూప్‌ డిస్కషన్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ యాక్టివిటీ నిర్వహిస్తారు. అనంతరం గంటపాటు ముఖాముఖి ఉంటుంది. అన్ని దశల్లోరూ సంతృప్తికరంగా ఉంటే ఫెలోషిప్‌లోకి తీసుకుంటారు.
యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌లు:

వీటిని అశోకా యూనివర్సిటీ అందిస్తోంది. ఈ సంస్థ హరియాణలోని సోనాపేట్‌లో ఉంది. లిబరల్‌ ఆర్ట్స్‌ చదువుల్లో దేశంలో పేరున్న వాటిలో ఇదొకటి. యంగ్‌ ఇండియా ఫెలోషిప్‌లో చేరినవారు కోర్సు అనంతరం తాము కోరుకున్న విభాగం (డిసిప్లిన్‌) నుంచి పోస్టుగ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ లిబరల్‌ స్టడీస్‌ డిగ్రీ అందుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది.

దేశవ్యాప్తంగా 300 మందికి అవకాశం కల్పిస్తారు. సమస్యలను పరిష్కరించి, సమాజంపై ప్రభావం కలిగించడంలో కార్యరూపం దాల్చగలిగే ఆలోచనలను ఆహ్వానిస్తారు. కోర్సు,

వసతి నిమిత్తం ఏడాదికి రూ.9.45 లక్షలు చెల్లించాలి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారికి పూర్తిగా ఫీజు మినహాయింపు లేదా రాయితీ లభిస్తుంది.
ఎంపిక విధానం:

దరఖాస్తుదారుల అకడమిక్‌ నేపధ్యం, ఆలోచనలు, అభిరుచులు గమనిస్తారు. వడపోతలో ఎంపికైనవారికి టెలిఫోన్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. సాధారణంగా ఇది 20 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. ఇందులో ఎంపికైనవారిని ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. ఇంటర్వ్యూ రోజే కాంప్రహెన్షన్‌ పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత ముఖాముఖి జరిపి కోర్సులోకి తీసుకుంటారు.అర్హత: యూజీ లేదా పిజి పూర్తిచేసిన వారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సులు చేదువుతున్నవారు దరఖాస్తు చేసుోవచ్చు. మంచి విద్యానేపధ్యం కలిగి ఉండాలి.

ఎక్‌స్ట్రా కరిక్యులర్‌ యాక్టివిటీస్‌కు ప్రాధాన్యం ఉంటుంది. రిటన్‌, వెర్బల్‌ కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగుండాలి. రౌండ్‌ 2 ప్రవేశాలకు ఫిబ్రవరి 2, రౌండ్‌ 3 ప్రవేశాలకు మార్చి 31,2020

తాజా ‘నిఘా’ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/investigation/