పదో తరగతి గణితం పేపర్‌లో అదనంగా 6 మార్కులు

ssc exam
ssc exam

హైదరాబాద్‌: ఇటివల ముగిసిన పదో తరగతి గణితం పరీక్షపత్రంలో నాలుగు ప్రశ్నలు తప్పుగా ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. దీంతో విద్యార్థులకు 6 మార్కులు కలపాలని విద్యాశాఖ నిర్ణయించింది. పేపర్‌- 1లో 5.5 మార్కులు, పేపర్‌ -2లో అరమార్కు కలపాలని నిర్ణయించారు. అంతేకాక తప్పుడు ప్రశ్నలకు సమాధానం రాసేందుకు ప్రయత్నించిన విద్యార్థులందరికీ ఈ మార్కులు జత కలవనున్నాయి.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/