రాష్ట్రపతి అధికారాలు-విధులు

ఇండియన్‌ పాలిటీ ప్రత్యేకం

Rashtrapati Bhawan

మంత్రుల, న్యాయమూర్తుల నియామకాలు, తొల గింపులు,బిల్లులకు ఆమోదముద్రలు, దౌత్య కార్య కలాపాలకు అనుమతులు తదితరాలన్నీ రాష్ట్రపతి అధికారాల్లో ప్రధానమైనవి. కార్య నిర్వ హణ అంతా ఆయనపేరు మీదే జరుగుతుంది. రాజ్యపరమైన విధులన్నీ ఆయనతోనే అనుసంధా నమై ఉంటాయి.రాష్ట్రపతి అధికారాలు, విధులను ప్రధానం గా 7 రకాలుగా విభజించవచ్చు.

ఆయన పేరు మీదే కార్యనిర్వహణ:
కేంద్ర కార్యనిర్వహణాధికారం, పరిపాలన రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. కేంద్ర మంత్రి మండలి నిర్ణయాలను రాష్ట్రపతికి తెలియ జేయాల్సిన బాధ్యత ప్రధానమంత్రికి ఉంటుంది (ఆర్టికల్‌ 78)

  • రాష్ట్రపతి కేంద్ర ప్రభుత్వ పరిపాలనను సక్రమంగా నిర్వహించడానికి ప్రధానమంత్రి, మంత్రిమండలితో పాటు అనేకమంది ఇతర అధికారులను నియమిస్తారు. లోక్‌సభ లో మెజారిటీ పార్టీ లేదా మెజారిటీ పొందిన సంకీర్ణ కూటమి నాయకుడిని ప్రధానిగా నియమిస్తారు. ఏ పార్టీకి లేదా సంకీర్ణ కూటమికి మెజారిటీ లేకపోతే లోక్‌సభ లో అత్యధిక స్థానాలు పొందిన పార్టీకి చెందిన వ్యక్తి, మెజారిటీ పొందగలడని భావించిన నాయకుడిని ప్రధానిగా నియమిస్తారు (ఆర్టికల్‌ 75(1)). ప్రధానమంత్రి సూచన ప్రకారం మత్రులను నియమించి, శాఖలను కేటాయిస్తారు. శాఖలను మార్చడం, అవసరమైతే మంత్రివర్గం నుంచి తొలగిచే అధికారం కూడా ఉంటుంది. మం త్రిమండలి నాయకుడైన ప్రధానమంత్రి సూచనపై అటార్నీ జనరల్‌ (ఆర్టికల్‌ 76), సుప్రీం కోర్టు, హైకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తు లను (వరుసగా ఆర్టికళ్లు 124,217), కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (ఆర్టికల్‌ 148),రాష్ట్రాల గవర్నర్లు (ఆర్టికల్‌ 155), కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, పరిపాలకులు (ఆర్టికల్‌ 239,239 ఎఎ), అంతర్‌ రాష్ట్ర మండలి ఛైర్మన్‌ ీ (ఆర్టికల్‌ 263), ఆర్ధిక సంఘం ఛైర్మన్‌, సభ్యులు(ఆర్టికల్‌ 280), యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మ న్‌,సభ్యులు(ఆర్టికల్‌316) ,కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషన్‌,ఇతర సాధారణ ఎన్నికల కమిషనర్లు(ఆర్టికల్‌ 324), సైన్యంలోని త్రివిద దళాల అధిపతులను, ఇతర దేశాల్లో భారత రాయబారులను,జాతీయ షెడ్యూల్డ్‌ కులా ల సంఘం ఛైర్మన్‌ (ఆర్టికల్‌ 338), జాతీయ షె డ్యూల్డ్‌ తెగలసంఘం ఛైర్మన్‌,సభ్యులను, సెంట్ర ల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌, విజిలెన్స్‌ కమిష న్లు,అనేకమందిఇతరఅధికారులను నియమిస్తారు.

ఆర్ధికానికి ఆమోదం:
ప్రతి ఆర్ధిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను (ఆర్టికల్‌ 112) పార్లమెంటులో రాష్ట్రపతి పేరు మీద ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు (వార్షిక బడ్జెట్‌ ఆర్ధిక శాఖా మంత్రి ప్రవేశపెడతారు)
-ఆర్ధిక బిల్లులను రాష్ట్రపతి అనుమతితోనే లోక్‌ సభలో ప్రవేశపెట్టాలి (మొదట లోక్‌సభలోనే ప్రవేశపెట్టాలి).ఆదాయపు పన్ను ద్వారా సమకూరిన మొత్తాన్ని కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య పంపిణీ చేయడం.జూట్‌ ఎగుమతుల ద్వారా వచ్చి న పన్నుల్లో కొంతభాగాన్ని అసోం,పశ్చిమబెంగాల్‌, బిహార్‌,ఒడిశా రాష్ట్రాలకు ఇవ్వడం. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఆర్ధిక వనరుల పంపిణీ కోసం అయిదు సంవత్సరాలకు ఒక ఆర్ధిక సంఘాన్ని నియమిస్తారు. ప్రస్తుతం ఎన్‌,కె. సింగ్‌ అధ్యక్షత న 15వ ఆర్ధికసంఘాన్ని 2020- 2025 మధ్య కాలానికి తగిన సిఫారసులు చేయడానికి 2017, నవంబరులో నియమించారు.

ఆర్ధిక సంఘం, కాగ్‌ నివేదికలను (రాష్ట్రపతికి సమర్పిస్తారు) పార్ల మెంటులో ప్రవేశ పెట్టేటట్లు చూడటం. భారత అగంతుక నిధి రాష్ట్రపతి (నియంత్రణలో) తరపున ఆర్ధికశాఖ కార్య దర్శి అధీనంలో ఉంటుంది(ఆర్టికల్‌ 267), అనుకోకుండా ఎదురయ్యే విపత్తులను ఎదుర్కోవ డానికి దీన్ని ఉపయోగిస్తారు.
సైన్యానికీ అధినేత: రాజ్యాంగంలోని 53 (2) ప్రకారం రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడు. త్రివిధ దళాధిపతులను నియమిస్తారు.యుద్ధం ప్రకటించ డానికి అనుయతించే అధికారం ఉంటుంది. అయితే దీనికి పార్లమెంటు ఆమోదం అవసరం.
దౌత్యానికి అనుమతులు: రాష్ట్రపతికి భారత రాయబారులను ఇతర దేశాల్లో నియమించడంతో పాటు,ఇతరదేశాల రాయబారులను భారత దేశం లో నియమించడానికి అనుమతించే అధికారం ఉంటుంది. భారతదేశం ఇతర దేశాలతో స్నేహ, వాణిజ్య సంబంధాలను పెంపొందించడానికి విదేశీ పర్యటనలు చేయడం.భారతదేశం చేసుకునే అంతర్జాతీయ ఒప్పందాలు రాష్ట్రపతి పేరుమీదే జరుగుతాయి.

ఈ ఒప్పందాలకు పార ్లమెంటు ఆమోదంతో పాటు రాష్ట్రపతి ఆమోదం అవసరం.
శాసన పరమైనవి: రాష్ట్రపతి భారత పార్ల మెంటులో అంతర్భాగం, లోక్‌సభ, రాజ్యసభ తోపాటు రాష్ట్రపతి పార్లమెంటులో ఒక భాగం. పార్లమెంటును సమావేశపరచడం, ప్రోరోగ్‌ చేయడం, అవసరంమైతే ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ప్రధానమంత్రి సలహాలపై లోక్‌సభ ను రద్దుచేసే అధికారం రాష్ట్రపతికి ఉంది. లోక్‌సభలో ఆంగ్లో ఇండియన్‌ వర్గానికి తగిన ప్రాతినిధ్యం లేదని రాష్ట్రపతి భావిస్తే ఆ వర్గానికి చెందిన ఇద్దరు సభ్యులను లోక్‌సభ సభ్యులుగా నియమిస్తారు. రాజ్యసభకు కళలు, సాహిత్యం, సామాజిక సేవ మొదలైన రంగాల్లో ప్రసిద్ధి పొందిన 12 మందిని నియమిస్తారు.

లోక్‌సభ ఎన్నికల తర్వాత జరిగే పార్లమెంటు మొదటి సమావేశాలు, ప్రతి సంవత్సరం జరిగే బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభమ వుతాయి. ఒక బిల్టుచట్టం కావడానికి పార్లమెంటు లోని ఉభచ సభలతోపాటు(లోక్‌సభ,రాజ్యసభ) రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి. రాష్ట్రపతి ఆమోదం కోసం వచ్చిన బిల్లుపై రాష్ట్రపతికి కింది ప్రత్యామ్నాయాలు ఉంటాయి. వాటిని ఆమోదిం చడం లేదా బిల్లును తిరస్కరించడం (అబ్సల్యూట్‌ వీటో), బిల్లును పార్లమెంటు పునఃపరిశీలనకు పంపకుండా తనవద్దే ఉంచుకోవడం (పాకెట్‌ వీటో), పునఃపరిశీలనకు పంపిన బిల్లును పార్లమెంటు ఉభయ సభలు సవరణలతో లేదా సవరణలు లేకుండా ఆమోదించి తిరిగి పంపితే రాష్ట్రపతి తప్పక ఆయోదించాల్సి ఉంటుంది.

అంతేకాకుండా ఆర్ధిక బాల్లును పునఃపరిశీలనకు పంపే అధికారం రాష్ట్రపతికి లేదు. పార్లమెంటు సమావేశంలో లేనప్పుడు రాజ్యాంగంలోని 123వ నిబంధనను అనుసరించి ఆర్డినెన్సులను జారీచే యగలరు. ఆర్బినెన్సు పార్లమెంటు ఆమోదం పొందిన చట్టానికి సమానమైన విలువను కలిగి ఉంటుంది. దీని కాలపరిమితి ఆరు నెలలు అయినప్పటికీ పార్లమెంటు ఆమోదం పొందిన చట్టానికి సమామైన ఆరు వారాల లోపల ఈ ఆర్డి నెన్సు పార్లమెంటు ఆమోదంపొందాలి లేదా ఆరి ్డనెన్సు రద్దవుతుంది (ఆర్డినెన్సు గరిష్ఠంగా 6నెలల 6 వారాలు అంటే ఏడున్నర నెలలు) పార్లమెంటు ఆమోదం పొందకముందే రాష్ట్రపతి ఆర్డినెన్సును రద్దు చేయగలరు.5వ లోక్‌సభ కాలంలో గరిష్టం గా ఆర్డినెన్సులు జారీచేశారు.

అదేవిధంగా 1993 లో గరిష్టంగా 34 ఆర్డినెన్సులను జారీ చేశారు.
అత్యవసర సమయంలో: రాజ్యాంగంలోని 18వ భాగం రాష్ట్రపతికి ఉన్న అత్యవసర అధికారాలను వివరించింది,అవి: జాతీయ అత్యవసర పరిస్థితి (352వ నిబంధన): యుద్ధం,విదేశీదాడి సాయుధ తిరుగుబాటు మొదటైన కారణాల వల్ల భారత దేశం లేదా దేశంలోని ఏదైనా ఒక ప్రాంతం భద్రతకు ప్రమాదం ఏర్పడితే రాష్ట్రపతి 352వ నిబంధన ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించగలరు. దీనికి ప్రధానితో కూడిన కేబినెట్‌ లికిత పూర్వక సలహా తప్పనిసరి (44వ రాజ్యాంగ సవరణ తర్వాత కేబినేట్‌ లికితపూర్వక సలహా అవసరం).

  • అత్యవసర పరిస్తితి ప్రకటనను పార్లమెంటు ఉభయసభలు నెల లోపల 2/3 వంతు మెజా రిటీతో ఆమోదించాలి. (ప్రకటనకు అనుకూలంగా ఓటు వేసినవారి సంఖ్య సభ మొత్తం సభ్యుల్లో సగం కంటే ఎక్కువ ఉండాలి), లోక్‌సభ రద్దయి ఉంటే రాజ్యసభ ఆమోదించాలి. అయితే లోక్‌ సభ ఏర్పడి మొదటి సమావేశం జరిగిన రోజు నుంచి 30 రోజుల లోపల జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటనను 2/3వ వంతు మెజారిటీతో ఆమోదించాలి. లేకపోతే అత్యవసర పరిస్థితి రద్ద వుతుంది.ఒకసారి పార్లమెంటు ఆమోదం పొందితే 6 నెలలపాటు కొనసాగుతుంది.తిరిగి ఆమోదిస్తే మరో 6 నెలలపాటు కొనసాగుతుంది.

దీనికి రాజ్యాంగం ప్రకారం గరిష్ట కాలపరిమితి లేదా ఎన్నిసార్లు విధించవచ్చు అనే అంశంపై పరిమి తులు లేవు.లోక్‌సభ సమావేశాలు జరుగుతుంటే స్పీకర్‌కు లేదా సమావేశంలో లేకపోతే రాష్ట్రపతికి లోక్‌సభలోని మొత్తం సభ్యుల్లో1/10 వంతు నోటీసు అందజేస్తే 14రోజుల లోపల లోక్‌సభను సమావేశపరచాలి.

న్యాయ అధికారాలు:
సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తులను. ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల అధికారి, కాగ్‌ మొద లైన అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారిని తొలగించడానికి పార్లమెంటు ఉభయ సభలు విడివిడిగా2/3వవంతు మెజారిటీతో అసమర్ధత లేదా నిరూపితమైన దుష్ప్రవర్తన కారణాలపై అబి µశంసన తీర్మానాన్ని ఆమోదిస్తే వారిని రాష్ట్రపతి పదవి నుంచి తొలగిస్తారు.

  • హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేసే అధికారం రాష్ల్రపతికి ఉంటుంది.
  • సుప్రీంకోర్టు ప్రధాన, సాధారణ న్యాయమూర్తు లు తమ రాజీనామా పత్రాలను రాష్ట్రపతి పేరు మీదుగా రాసి రాష్ట్రపతికి సమర్పించాలి.
  • రాజ్యాంగంలోని 72వ నిబంధన ప్రకారం మార్షల్‌ కోర్టు విధించిన శిక్షలు, కేంద్ర ప్రభుత్వ కార్యనిర్వహణ అధికార పరిధిలోని విషయాలు, మరణశిక్ష మొదలైన అంశాలపై రాష్ట్రపతి క్షమాభిక్ష, శక్షను తాత్కాలికంగా వాయిదా వేయడం, ప్రత్యేక పరిస్థితుల్లో శిక్షను తగ్గించడం, శిక్ష పరిమాణం లేదా కాలపరిమితిని తగ్గించడం, శిక్షను మార్పు చేయడం లాంటివి చేయగలరు
  • ప్రజాప్రాధాన్యం ఉన్న అంశాలపై రాష్ట్రపతి సుప్రీంకోర్టు న్యాయ సలహా కోరగలరు(ఆర్టికల్‌ 1430 ఇప్పటివరకు రాష్ట్రపతి 16 సార్లు న్యాయ సలహా కోరారు. అయితే సుప్రీంకోర్టు సలహాను పాటించే విషయంలో రాష్ట్రపతి తన విచక్షణాధికాన్ని వినియోగిస్తారు.
  • రాష్ట్రపతి విధి నిర్వహణ విషయంలో ఏ న్యాయస్థానానికీ జవాబుదారీ కాదు. దీనికి కార ణం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్ణయాలు జరిగిన ప్పటికీ వాస్తవ కార్యనిర్వహణాధికారాలను ప్రధాని నాయకత్వంలోని మంత్రిమండలి చెలాయించడం.
    -రాష్ట్రపతిని అధికారంలో ఉండగా అరెస్టు చేయకూడదు. క్రిమినల్‌ కేసులు నమోదు చేయకూడదు. అయితు సివిల్‌ కేసులను 2 నెలల ముందస్తు నోటిస్‌తో నమోదు చేయవచ్చు.

తాజా మొగ్గ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/kids/