ఉస్మానియాలో మార్చి 26నుండి డిగ్రీ పరీక్షలు

Osmania University
Osmania University

హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటి పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. కాగా బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీఎస్‌డబ్ల్యూ, బీకాం ఆనర్స్, దూరవిద్య బీకాం, దూరవిద్య బీబీఏ తదితర అన్ని కోర్సుల మొదటి, రెండో, మూడో సంవత్సరం బ్యాక్‌లాగ్, మూడో సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 26వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్‌సైట
www.osmania.ac.in లో చూసుకోవచ్చని సూచించారు.