ఎన్‌ఐటిలో కంప్యూటర్‌ కోర్సు

‘నిమ్‌సెట్‌’ ప్రకటన విడుదల

Nimset announces Notification

దేశంలోని ప్రసిద్ధ ఎన్‌ఐటిల్లో కంప్యూటర్‌ విద్యను అభ్యసించడానికి మరో మార్గం ఉంది. అదే నిమ్‌సెట్‌. నిర్ణీత సబ్జెక్టుల్లో లేదా ఇంజినీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసినవారు ఈ పరీక్ష రాసి ప్రవేశాలు పొందవచ్చు.

మూడేళ్లల్లో పిజి పట్టాను అందుకోవచ్చు. సాంకేతిక విద్యకు ఐఐటిల తర్వాత గుర్తుకు వచ్చేవి ఎన్‌ఐటిలే. చాలా ఎన్‌ఐటిలు ఎంసిఎ (మాస్టర్‌ ఆఫ్‌ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌) కోర్సునూ అందిస్తున్నాయి.

వీటిలో ప్రవేశానికి ఏటా జాతీయస్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ఎంసిఎ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (నిమ్‌సెట్‌) నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసిఎ కోర్సులో ప్రవేశానికీ ఈ స్కోరే ప్రామాణికం. వీటిలో కోర్సులు పూర్తి చేసుకున్నవారు

మేటి ఐటి కంపెనీల్లో అవకాశాలను సొంతం చేసుకుంటున్నాయి. ఈ ఏడాదికి నిమ్‌సెట్‌-2020 ప్రకటన వెలువడింది.

నిమ్‌సెట్‌ స్కోరుతో 10 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (నిట్‌)ల్లో ప్రవేశం లభిస్తుంది. వీటిలో వరంగల్‌ ఒకటి.

దేశీయ, విదేశీ ఐటి సంస్థల అవసరాల ప్రకారం ఇక్కడి ఎంసిఎ సిలబస్‌ ఉంటుంది. సంస్థలన్నీ ఒకే సిలబస్‌ను అనుసరిస్తాయి.

అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా బిఎస్సీ, బిసిఎ, బిఐటి, బీటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌/ కంప్యూటర్‌ అప్లికేషన్స్‌)ల్లో ఏదైనా కోర్సు చదివి ఉండాలి.

లేదా బిటెక్‌/బిఇ ఏ బ్రాంచి వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏ కోర్సు చదివినప్పటికీ కనీసం 60 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55శాతం తప్పనిసరి. చివరి సంవత్సరం చదువుతున్నవారూ అర్హులే.

ప్రశ్నపత్రం తీరు:

ప్రవేశపరీక్షలో మొత్తం 120 ప్రశ్నలుంటాయి. వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రం ఆంగ్ల మాధ్యమంలో ఉంటుంది. సబ్జెక్టుల వారీ మ్యాథమేటిక్స్‌ 50 ప్రశ్నలు.

ఆనలిటికల్‌ ఎబిలిటీ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40, కంప్యూటర్‌ ఆవేర్‌నెస్‌ 10, జనరల్‌ ఇంగ్లీష్‌ నుంచి 20 ప్రశ్నలడుగుతారు.

ప్రతి సరైన జవాబుకు 4 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.

సీట్ల కేటాయింపు:

మెరిట్‌, రిజర్వేషన్ల ప్రాతిపదికన ఉమ్మడి కౌన్సెలింగ్‌ ద్వారా సీట్లను కేటాయిస్తారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంసిఎలో చేరాలనుకున్నవారు ఆ సంస్థ ప్రకటన వెలువడినప్పుడు ఈ స్కోరుతో దరఖాస్తు చేసుకోవచ్చు.

ఏ ఎన్‌ఐటిలో ఎన్ని సీట్లు:

అగర్తలా-3-, అలహాబాద్‌-116, భోపాల్‌-115, కాలికట్‌-58, జంషెడ్‌పూర్‌-115చ కురుక్షేత్ర-96, రాయపూర్-110, సూరత్కల్‌-58, తిరుచిరాపల్లి-115, వరంగల్‌-58.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: 31.-3.2020 (సాయంత్రం 5 గంటల వరకు) పరీక్ష తేది: మే 24
(ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు)
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, వరంగల్‌,
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.1250, మిగిలిన వారికి రూ.2500
వెబ్‌సైట్‌: https://nimcet.in/

తాజా ఆధ్యాత్మికం వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/devotional/