ఫణి కారణంగా నీట్‌ పరీక్ష వాయిదా

NEET Exam 2019
NEET Exam 2019

న్యూఢిల్లీ: ఫణి తుఫాను కారణంగా ఒడిశా అతలాకులమైన విషయం తెలిసిందే. అయితే ఈ సందర్భంగా మే 5వ తేదీన జరగాల్సిన నేషనల్‌ ఎలిజిబిలిటీ కం ఎంట్రెన్స్‌(నీట్‌)ను ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తామనే విషయాలను త్వరలోనే వెల్లడిస్తామని అధికారులు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాల కోసం మే 5న నిర్వహించే నీట్‌కు దేశ వ్యాప్తంగా 15.19 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇతర వివరాలకు నీట్‌ వైబ్‌సైట్‌ను లాగిన్‌ అవొచ్చు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/