ఐఐటిలో మెట్రో రైల్‌ టెక్నాలజీ

chennai metro rail limited
chennai metro rail limited

ఐఐటి మద్రాస్‌లో పిజి డిప్లొమా ఇన్‌ మెట్రో రైల్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి సిఎంఆర్‌ఎల్‌ ప్రకటన విడుదల చేసింది.
కోర్సు: పిజి డిప్లొమా ఇన్‌ మెట్రో రైల్‌ అండ్‌ మెనేజ్‌మెంట్‌
ఈ కోర్సును చెన్నై మెట్రో రైల్‌ లిమిటెడ్‌ (సిఎంఆర్‌ఎల్‌) స్పాన్సర్‌ చేస్తుంది. ఈ కోర్సును ఐఐటి మద్రాస్‌ నిర్వహిస్తుంది.
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో బిఇ/బిటెక్‌(సివిల్‌ లేదా ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌ లేదా మెకానికల్‌)
ఉత్తీర్ణత, ఎస్సీ/ఎస్టీలకు 65 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతోపాటు గేట్‌లో వ్యాలిడ్‌ స్కోర్‌ను కలిగి ఉండాలి.
వయస్సు: 28 ఏళ్లు మించరాదు
ఎంపిక: గేట్‌ స్కోర్‌, మెడికల్‌ ఫిట్‌నెస్‌ ద్వారా
స్టయిఫండ్‌: నెలకు రూ.20.000తో పాటు ఐఐటి మద్రాస్‌కు చెల్లించాల్సిన ఫీజులను సిఎంఆర్‌ఎల్‌ చెల్లిస్తుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్‌ 18
వెబ్‌సైట్‌: http://chennaimetrorail.org

తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/career/