మార్చి 28లోగా ఓపెన్ డిగ్రీ అర్హ‌త ప‌రీక్ష‌కు గ‌డువు

BRAOU
BRAOU


హైదరాబాద్ : డా.బీఆర్.అంబే ద్కర్ సార్వ త్రిక విశ్వవిద్యాలయంలో డిగ్రీలో ప్రవేశం కోసం
నిర్వహించే అర్హతా పరీక్షకు హాజరుకావాలనుకునే వారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. ఎలాంటి
విద్యార్హత లేకున్నా జూలై 1 నాటికి 18ఏళ్లు నిండిన వారంతా అర్హతా పరీక్ష ద్వారా
బీఏ.బీకామ్, బీఎస్‌సీ కోర్సు ల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. ఏప్రిల్ 28వ తేదీన
రెండు తెలుగు రాష్ర్టాల్లో నిర్వహించనున్న అర్హతా పరీక్షకు హాజరుకావాల నుకునే వారు
రూ.300 ఫీజుతో పాటు ఆన్‌లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.