ప్రైవేట్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ కు పరిమిత సంఖ్యలో విద్యార్థులు

ఏపీ విద్యాశాఖ మంత్రి సురేష్ వెల్లడి

Intermediate class room
Intermediate class room

Amaravati: రాష్ట్రంలో విద్యావ్యవస్థ లో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

అందులో భాగంగా ఇటీవల జీ. ఓ ఎం. ఎస్ 23ను విద్యాశాఖ జారీ చేసినట్టు మంత్రి సురేష్ ఒక ప్రకటన లో వెల్లడించారు.

ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో ఒక్కో సెక్షన్ కు 40 మందిని మాత్రమే అడ్మిషన్ చేసుకునే విదంగా ఈ జీ. ఓ జారీ చేయటం జరిగింది.

మార్చి 2002లో విడుదలైన జీ. ఓ 12ను సవరిస్తూ ఈ జీ. ఓ ను జారీ చేసినట్లు తెలిపారు.

సీ బి ఎస్ ఈ నిబంధనలకు అనుగుణంగా ఈ జీ ఓ జారీ చేసినట్లు తెలిపారు. కనిష్టంగా 4 సెక్షన్ లకు 160 మంది, గరిష్టంగా 9  సెక్షన్ లకు 360 మందిని చేర్చుకునే విదంగా పరిమితి విధించినట్లు మంత్రి తెలిపారు.

ప్రథమ, ద్వితీయ సంవత్సరాలకు గరిష్టంగా 360+360 మొత్తం 720 మంది మాత్రమే ఉండాలన్నారు.

గతంలో గరిష్టంగా ఉన్న 1584 మంది సంఖ్య ను కుదించినట్లు ఆయన తెలిపారు.

దీనివల్ల విద్యార్థులు చదువుకునేందుకు చక్కటి వెలుతురు, గాలి, గదుల్లో ఇరుకుగా ఉండకుండా విశాలమైన వాతావరణం మధ్య సౌకర్యవంతంగా ఉంటుంది.

అలాగే విద్యార్థులపై అధ్యాపకులు వ్యక్తిగత శ్రద్ద పెట్టి బోధించేందుకు వీలు కలిగి నాణ్యమైన విద్య అందించేందుకు దోహదపడుతుందని మంత్రి సురేష్ తెలిపారు.

నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించే కళాశాలలపై చర్యలు ఉంటాయని, ఇప్పటికే కళాశాలలను అధికారులు తనిఖీలు చేయటం, నిబంధనలు పాటించని కళాశాలల గుర్తింపును రద్దు చేయటం కూడా జరుగుతుందన్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం : https://www.vaartha.com/news/international-news/