గిరిజన సంక్షేమ పాఠశాలల్లో దరఖాస్తుల గడువు పెంపు

tribal-welfare-schools
tribal-welfare-schools

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ వసతి గృహ విద్యాసంస్థలో ప్రవేశాలకు గడువు పొడిగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఆన్‌లైన్‌లో ఈ దరఖాస్తూల స్వీకరణ గడువు ఈ నెల 5తో ముగియనుంది. కాగా పలువురి విజ్ఞప్తి మేరకు ఈ గడువును జూన్‌ 9వ తేదీ వరకు పొడిగించారు. ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బాలికలు), జంగంమెట్, బోడుప్పల్, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బాలురు), కొత్తూరు, నాదర్‌గుల్‌లో ఆరో తరగతిలో ప్రవేశాలకు గడువు పెంపు. మరింత సమాచారం కోసం www.tgtwgurukulam.telangana.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/