జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీలో మార్పు

IIT JEE Advanced Exam
IIT JEE Advanced Exam

న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ఈ సంవత్సరం మే నెల 19న జరగాల్సిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష తేదీలో మార్పులు చేశారు. మే 27న పరీక్షను నిర్వహించనున్నట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఆర్గనైజింగ్‌ ఇనిస్టిట్యూట్‌ ఐఐటీ రూర్కీ వెల్లడించింది. అయితే అంతకుముందు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మే 19న నిర్వహించనున్నట్లు ప్రకటన వెలువడింది. అయితే అదే రోజున లోక్‌సభ ఎన్నికల చివరి విడత పోలింగ్‌ జరగనుంది. 8 రాష్ట్రాల్లోని 59 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 19న పోలింగ్‌ నిర్వహించనున్నారు. దీంతో విద్యార్థులకు ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు పరీక్ష తేదీని మార్చినట్లు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వాహకులు తెలిపారు. మే 27 సోమవారం పరీక్షను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు పేపర్‌ 1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్‌ 2 పరీక్ష ఉంటుంది.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/