గురుకుల పాఠ‌శాల‌ల్లో ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

TSTWREIS
TSTWREIS

హైదరాబాద్ : రాష్ట్రంలోని 92 తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతి వరకు 2019- 20 విద్యాసంవత్సరానికి మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునేం దుకు ఈ నెల 23వరకు చివరి తేదీ ఉండగా, ప్రవేశపరీక్ష 30వ తేదీన అన్ని జిల్లాకేంద్రాల్లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. వివరాలకు WWW. TGTWGURUKULAM. TELANGANA GOV.IN వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

తాజా కెరీర్ వార్త‌ల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/specials/career/