ఏపిలో నేడు ఇంటర్ ఫలితాలు

అమరావతి: ఏపిలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఈరోజు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి బి.ఉదయలక్ష్మి విడుదల చేయనున్నారు. సచివాలయంలోని బ్లాక్ నంబరు3లో ఉదయం 11గంటలకు ఫలితాలను ప్రకటిస్తారు. మొదటిసారిగా ఫలితాలను గ్రేడింగ్విధానంలో విడుదల చేస్తున్నారు. ఇంటర్ సాధారణ, వృత్తివిద్యా కోర్సుల పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
మరిన్ని తాజా కెరీర్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/specials/career/