ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్‌ ఎంబిఎ

ఇంటిగ్రేటెడ్‌ ప్రొగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌

Integrated MBA at IIM

ఐఐఎం రోహ్‌తక్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రొగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఐపిఎం)లో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఇంటర్‌ ఉత్తీర్ణులు, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

రాతపరీక్ష, ఇంటర్వ్యూల్లో చూపి ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు. విజయవంతంగా పూర్తిచేసిన వారికి బిబిఎ, ఎంబిఎ డిగ్రీలను ప్రదానం చేస్తారు.గత ఏడాది నుంచి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబిఎలో ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.

ఇంటర్‌ తర్వాత మేనేజ్‌మెంట్‌ విద్య చదవాలనుకునే వారికి ఈ కోర్సు ఎంతో ప్రయోజనకరం. ఏడాదికి మూడు చొప్పున అయిదేళ్ల కోర్సులో 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్‌ వ్యవధి 3 నెలలు.

మొత్తం కోర్సుని రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో పౌండేషన్‌ కోర్సులై దృష్టి సారిస్తారు. రెండో భాగంలో మేనేజ్‌మెంట్‌ విద్యలో మెలకువలు బోధిస్తారు.

కోర్సు పూర్తి చేసుకున్నవారికి ఐఐఎం రోహ్‌తక్‌ ఎంబిఎతోపాటు బిబిఎ డిగ్రీనీ ప్రదానం చేస్తుంది.

మూడేళ్ల తర్వాత చదువు మానేస్తే బిబిఎ డిగ్రీ ఇస్తారు. మొత్తం 150 సీట్లు ఉన్నాయి. కోర్సు ఫీజు అయిదేళ్లకు రూ.30 లక్షలకు పైగా ఉంటుంది.

ఆప్టిట్యూట్‌ టెస్ట్‌:

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, వెర్బల్‌ ఎబిలిటీ, లాజికల్‌ రీజనింగ్‌ల్లో ఒక్కో విభాగం నుంచి 40 చొప్పున ప్రశ్నలు వస్తాయి. ప్రతి విభాగాన్ని 40 నిమిషాల్లో పూర్తి చేయాలి.

మొత్తం పరీక్ష వ్యవధి రెండు గంటలు. అన్నీ ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే. సరైన సమాధానానికి 4 మార్కులు ఉంటాయి. తప్పుగా గుర్తించిన జవాబుకు ఒక మార్కు తగ్గిస్తారు.

పర్సనల్‌ ఇంటర్వ్యూ:

ఆప్టిట్యూట్‌ టెస్టులో అర్హత సాధించినవారికి పర్సనల్‌ ఇంటర్వ్యూ, రిటన్‌ ఎబిలిటీ టెస్టులను మే 3,4 వారాల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా అకడమిక్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పరిశీలిస్తారు. ఫలితాలు జూన్‌ రెండోవారంలో వెలువడతాయి.

జులైలో ప్రవేశాలను చేపట్టి, ఆగస్టులో తరగతులు ప్రారంభిస్తారు.అర్హత: పదోతరగతి, ఇంటర్‌లో కనీసం 60శాతం మార్కులు సాధించాలి.

ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం తప్పనిసరి. వయసు జులై 31,2020 నాటికి 20 ఏళ్లలోపు ఉండాలి.అన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: ఏప్రిల్‌ 6దరఖాస్తు ఫీజు: రూ, 3,890 పరీక్ష తేదీ: మే 1తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు హైదరాబాద్‌, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: www.iimrohtak.ap.in

తాజా వార్త ఇ-పేపర్‌ కోసం క్లిక్‌ చేయండిhttps://epaper.vaartha.com/