ఐఇఎస్‌ పరీక్ష ప్రిపరేషన్‌ టిప్స్‌

Exams preparaton Tips

కష్టపడి చదివి, అవగాహనతో సంసిద్ధమైతే ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ఎగ్జామినేషన్‌లో విజయం సా ధించవచ్చు. అలా చేయాలంటే పరీక్షార్థులకుకొన్ని మెలకువలు అవసరం. వాటి గురించి చర్చిద్దాం
ప్రాథమిక అంశాలపై పట్టు:ప్రిలిమ్స్‌లో సిలబస్‌ను దృష్టిలో ఉంచుకొని అంశాల వారీగా ప్రాథమికాంశాలపై (బేసిక్స్‌) మంచి పట్టు సాధించాలి.ఈఎస్‌ఈ సిలబస్‌ విస్తృతం, సమయం చాలి తక్కువగా ఉన్నందున ప్రిఫరేషన్‌ వేగంగా నిర్ధష్టంగా ఉండాలి. వెయిటేజి అధికంగా ఉన్న సబ్జెక్టులపై సులభంగా మార్కులు సాధించే సబ్జెక్టులు, అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలి.

పరీక్ష ఎంత కఠినం? సిలబస్‌ పరిధి చాలా విశాలం. ప్రశ్నలు మధ్యస్థం నుంచి ఒకింత కఠినంగా ఉంటాయి. గత రెండు సంవత్సరాల నుంచి ఆచరణాత్మకమైన(ప్రాక్టికల్‌) ప్రశ్నలు చేర్చడం వల్ల కఠినత్వం పెరిగింది. ఈ పరీక్షకు పోటీ కూడా ఎక్కువే, సిలబస్‌ను వీలైనన్ని సార్లు పరిశీలించి అందులోని అంశాలను క్షు ణ్ణంగా అర్ధం చేసుకోవాలి.

ఏ అంశాల్లో బలం గా ఉన్నామో, వేటిలో బలహీనంగా ఉన్నామో తెలుసుకొని దానికి అనుగుణంగా ప్రణాళికాబ ద్దంగా చదవాలి. ఏరోజు సాధన చేయాల్సినవి అదే రోజు పూర్తి చేయాలి. దీని ద్వారా రివి జన్‌కు సమయం దొరుకుతుంది. చదివిన అంశాలపై పరిజ్ఞానం ఎంతుందో గ్రహించటా నికి మాక్‌ టెస్టులు రాయాలి. ప్రాథమిక అంశా ల సాధన తర్వాత గత ఈఎస్‌ఈ, గేట్‌, సివిల్‌ సర్వీసెస్‌, స్టేట్‌ సర్వీసెస్‌ ప్రశ్నపత్రాలను సాద µన చేయాలి. దీని వల్ల ఏయే అంశాలపై ఎటు వంటి ప్రశ్నలు అడుగుతున్నారో అవగతం అవు తుంది.

ఎన్‌పిటిఈఎల్‌ పాఠాలు ప్రాథమిక అంశా ల అవగాహనకూ, ఏవైనా సందేహాలు కలిగినప్పుడు నివృత్తి చేసుకోవడానికీ బాగా ఉపయోగపడతాయి. విశ్లేషణాత్మ ప్రశ్నల సమాధానాలకు కివి దోహదపడతాయి.
మెయిన్స్‌కు తగినంత సమయం: ప్రిలిమ్స్‌లో క్వాలిపై అయితే మెయిన్స్‌ రాయడానికి దాదాపు 6 నెలల సమయంం దొరుకుతుంది.

ఈ వ్యవధిలో పాఠ్యాంశాలపై విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునే అవకాశం ఉంటుంది. పేపర్‌ -2 లో సంబంధిత విభాగ ప్రశ్నలను సాధన చేసేటప్పుడు బేసిక్స్‌ ముందుగా చద వాలి. ఆ పై అంశాలను లోతుగా అధ్య యనం చేయాలి. పరీక్షల్లో కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం పడుతుంది. అలాంటివి సాధించాలం టే రివిజన చాలా అవసరం.

కన్వెన్షనల్‌ ప్రశ్నలు డిజైపఖ ఆధానితమై ఎక్కవ నిడివితో ఉంటా యి. చదవడంతోపాటు రాయడం కూడా బాగా అలలవాటు చేసుకోవాలి. క్వశ్చన్‌ కమ్‌ ఆన్సర్‌ బుక్‌లెట్‌ విధానం ఉంటుంది. రాయడానికి నిర్ణీత స్థలం ఉంటుంది. అందుకే వీలైనంత సూటిగా జవాబులు రాయాల్సి వుంటుంది. గత ప్రశ్నపత్రాల్లో అడిగిన ప్రశ్నల ను పరిశీలించి సమాధానాలు ఖచ్చితత్వంతో, తక్కువ దశలతో ఏ విధంగా రాబట్టాలో అవగతం చేసుకోవాలి. తగిన సాధన చేయాలి. ఐఇఎస్‌ ప్రిలిమ్స్‌కు గానీ, మెయిన్స్‌కు గానీ సన్నద్ధత సమయంలో ప్రశ్నపత్రాల సాధన అత్యంత కీలకం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telengana/