విమానయాన రంగంలోఉద్యోగాలు

IAF
IAF

విమానయాన రంగంలోఉద్యోగాలు

యువతలో ఎక్కువగా క్రేజ్‌ ఉన్న రంగాల్లో విమానరంగం కూడా ఒకటి.దీనిలో చేరినతరువాత ఉండే జీతభత్యాలు సదుపాయాలు కూడా బాగానే ఉండటం వల్ల ఎక్కువగా ఈ రంగం వైపు మొగ్గుచూపుతున్నారని చెప్పవచ్చు. మంచి జీతభత్యాలతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. చిన్నప్పుడు విమానాన్ని ఆశ్చర్యంగా కన్నార్పకుండా చూస్తూ పెరిగినవాళ్లమే. అప్పట్లో విమానాశ్రయానికి వెళ్లడం ఒక విశేషం తొలిసారి విమానంలో ప్రయాణించడం ఎప్పటికి మధుర జ్ఞాపకమే. అదే విమానం నడిపే అవకాశమే వస్తే.. ఎంతో సంతోషమే కదా. మరి ఫైలట్‌ శిక్షణ ఎంతో ఖర్చుతో కూడింది. కదా అని ఆలోచిస్తున్నారా? మరేం పర్వాలేదు. ఆసక్తి ఉత్సాహం మీ సొంతమైతే పైసా చెల్లింకుండా పైలట్‌ శిక్షణ పొందవచ్చు. వెంటనే ఉద్యోగంలోనూ చేరిపోవచ్చు. మామూలు విమానాలే కాదు యుద్ధ విమానాలతో ఆకాశంలో విన్యాసాలూ చేయోచ్చు.

ఈ అవకాశాన్ని ఎయిర్‌ఫోర్స్‌ కల్పిస్తోంది. విమానాలు, హెలికాప్టర్లు నడపడానికి ఫైలట్లు వాటి నిర్వహణ, మరమ్మతులకు టెక్నికల్‌, గ్రౌండ్‌ డ్యూటీ సిబ్బంది. ఎయిర్‌మెన్లు.. ఎన్నో ఉద్యోగాలున్నాయి. గగనతనంలో. ఆఫీసర్‌ హోదాతో ఫ్లయింగ్‌ గ్రౌండ్‌ డ్యూటీి (టెక్నికల్‌, నాన్‌ టెక్నికల్‌) విభాగాల్లో విధులు ఉంటాయి. ఫ్లయింగ్‌ బ్రాంచీలో ఎంపికైనవారు ఫైలట్‌గా సేవలు అందిస్తారు. ఇందులో ఫైటర్లు, ట్రాన్స్‌పోర్టర్లు హెలికాప్టర్లను నడిపేవాళ్లు హెలికాప్టర్‌ పెలెట్లు, గ్రైండ్‌ డ్యూటీ టెక్నికల్‌ ద్వారా మెకినికల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. గ్రౌండ్‌ డ్యూటీ నాన్‌ టెక్నికల్‌ ఆడ్మినిస్ట్రేషన్‌, ఆకౌంట్స్‌, లాజిస్టిక్స్‌, ఎడ్యుకేషన్‌ మెటీరియాలజీ విభాగాలుంటాయి. ఫ్లయింగ్‌బ్రాంచ్‌: ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ (ఫైలట్‌) ఉద్యోగాలను యూపిఎస్సి నిర్వహించే ఎన్‌డిఎ, సిడిఎస్‌ఇలతోపాటు ఎఎఫ్‌ క్యాట్‌- ఎస్‌ఎస్సీ స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌ అండ ఉమెన్‌), ఎన్‌సిసి స్పెషల్‌ ఎంట్రీ (మెన్‌ ద్వారా దక్కించుకోవచ్చు. ఎన్డిఎ: మాథ్స్‌, ఫిజిక్స్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పూర్తిచేసిన వారు ఆఖరి సంవత్సరం కోర్సు చదువుతున్నవాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు16/2 -19/2 ఏళ్లలోపు ఉండాలి. ఎత్తు 162.5 సెంటిమీటరు, ఉండాలి. ఏడాదికి రెండుసార్లు జనవరి, ఆగస్టులో ప్రకటన వెలువడుతుంది. ఎంపికైనవాళ్లు నేషనల్‌ డిఫెన్స్‌ ఆకాడెమీ (ఎన్డిఎ) పుణేలో శిక్షణతోపాటు బిటెక్‌ విత్య ఆభ్యసిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి జెఎన్‌యు, న్యూఢిల్లీ ఇంజినీరింగ్‌ డిగ్రీలను ప్రదానం చేస్తుంది. శిక్షణ ఆనంతరం ఫ్లయింగ్‌ ఆఫీసర్‌ హోదా పొందుతారు.

సిడిఎస్‌ఇ:
కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీస్స్‌ ఎగ్జామినే షన్‌ (సిడిఎస్‌ఇ) పేరుతో యూపిఎస్సీ ఏడాదికి రెండుసార్లు జూన్‌, అక్టోబరుల్లో ప్రకటన వెలువర్తి స్తుంది. ఎయిర్‌ ఫోర్స్‌ ఫ్లయింగ్‌ బ్రాంచ్‌ ఉద్యోగాలకు ఇంటర్‌లో మాథ్స్‌ ఫిజిక్స్‌ చదువు కున్న గ్రాడ్యుయ్యేట్లు అర్హులు. వయసు 20-24 ఏళ్లలోపు ఉండాలి. ఎఎఫ్‌ క్యాట్‌: ఎయిర్‌ఫోర్స్‌ కామన్‌ ఆడ్మిషన్‌ టెస్టు(ఎఎఫ్‌క్యాట్‌) ద్వారా ఫ్టయింగ్‌ బ్రాంచ్‌ ఆవకాశాలు పొంతం చేసుకోవచ్చు.

ఇందులో రెండు విభాగాల్లో ఫైలట్‌ కావచ్చు. అవి ఎస్సెస్సీ ఎంట్రీ ఎన్సిసి స్పెషల్‌ ఎంట్రీ. ఈ పరీక్షకు సంబంధించి ప్రకటనలు ఏడాదికి రెండుసార్లు వెలువడతాయి. ఎస్సెస్సీ ఎంట్రీ: షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎస్‌ఎస్సీ) విధానంలో నియామకాలు చేపడతారు. మహిళలూ ఈ విభాగానికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఏదైనా డిగ్రీలో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. దీంతోపాలు ఇంటర్లో మీథ్స్‌ ఫిజిక్స సబ్జెక్టుల్లోనూ 60 శాతం మార్కులు తప్పనిసరి. ఎస్సిఈ్స స్పెషల్‌ ఎంట్రీ: ఎన్సీస్సీ సర్టాఫికెట్‌ ఉన్నవారికి ప్రత్యేకంగా ఎన్సీ స్పెషల్‌ ఎంట్రీ ద్వారా ఫ్లయింగ్‌ బ్రాంచ్‌లో అవకాశం కల్పిస్తున్నారు. పురుషులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. కనీసం 60 శాతం మార్కులతో ఏదైని డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంటర్‌లో మాథ్స్‌, ఫిజిక్స్‌ చదివుండాలి. ఎయిర్‌మెన్‌ ఇందులో గ్రూప్‌ ఎక్స్‌, గ్రూప్‌ వై అనే రెండు ట్రేడ్లు ఉంటాయి.

వీటిలో గ్రూప్‌ వైలో మ్యుజీషియన్‌, మెడికల్‌ అస్టిస్టెంట్‌, ఇతర ట్రేడ్లు ఉంటాయి. గ్రూప్‌ ఎక్‌సలో ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌, ఇతర ట్రేడ్లు ఉన్నాయి. పరీక్షలో ప్రతిభ ఫిజికల్‌, మెడికల్‌ టెస్టుల ద్వారా నియామకాలు చేపడతారు.

గ్రూప్‌ వై మ్యుజీషియన్‌:
ఈ గ్రేడ్‌ ఉద్యోగాలకు పదోతరగతి విద్యార్హతతో పోటీ పడవచ్చు. అయితే ఏదైనా సంగీత/ వాద్యపరికరంలో ప్రావీణ్యం ఉండాలి. మెడికల్‌ అసిస్టెంట్‌: 10+2/ ఇంటర్లఓ బయోలజీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీష్‌ సబ్జెక్టులతో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు ఈ పోస్టులకు అర్హులు.

ఇంగ్లీష్‌లో విడిగా 50 శాతం మార్కులు ఉండాలి. మయసు 17-21 ఇతర ట్రేడు: 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు విటికి అర్హులు. ఆంగంలో 50 శాతం మార్కులు తప్పనిసరి. వయసు 17-21 లోపు ఉండాలి.

టెక్నికల్‌:
ఈ విభాగాంలో పోస్టులకు మాథ్స్‌, ఫిజిక్స్‌ ఇంగ్లిష్‌ సబ్జెక్టులతోఇంటర్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అలాగే విడిగా ఆంగ్లంలో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 50 శాతం మార్కులతో నిర్దేశిత ట్రేడులల్లో మూడుళ్ల డిప్లొమా ఉత్తీర్ణులూ దరఖాస్తు చేసుకోవచు. వీరు ఇంగ్లిష్‌ సబ్జెక్టులో 50 శాతం మార్కులతో డిప్లొమా/ఇంటర్‌/ పదోతరగతిలో ఉత్తీర్నత సాధించాలి.

ఎడ్యుకేషన్‌ ఇన్‌స్ట్రక్టర్‌:
బిఎడ్‌తోపాటు డిగ్రీ/ పిజి అర్హతలతో ఈ పోస్టులకు పోటీ పడవచ్చు. ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా బిఎ లేదా ఫిజిక్స్‌/సైకాలజీ/ కెమిస్టీ/ మాథ్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌/ స్టాటిస్టిక్స్‌ విటిలో ఏదైనా ఒక సబ్జెక్టుతో బిఎస్సీ లేదా బిసిఎ చదివినవారు దరఖాస్తు చేస్కుఓవచ్చు. సంబం ధిత కోర్సులో 20-25 ఏళ్లలోపు ఉండాలి. ఎంఎ- ఇంగ్లీష్‌/ సైకిలజి లేదా ఎమ్మెస్సీ- మాథ్స్‌/ఫిజిక్స్‌/ స్టాటిస్టిక్‌/ కంప్యూటర్‌ సైన్స్‌/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజి లేదా ఎంసిఎ విటిలో ఏదైనా కోర్సులో 50 శాతం మార్కులతో ఉత్తీ ర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.50 శాతం మార్కులతొ బిఎడ్‌ తప్పనిసరి మయసు 20 -28 ఏళ్లలోపు ఉండాలి. ========