పేదవిద్యార్థులకు ఉచిత కోర్సులు

రూ .లక్షల్లో ఫీజులున్నా అంతా ఉచితమే

Training Class (File)

పేరున్న సంస్థ ప్రసిద్ధ కోర్సులు రూ. లక్షల్లో పీజు అయినా అల్ఫాదాయ వర్గాలకు అంతా ఉచితం. ప్రామాణిక విద్యకు ప్రఖ్యాతి చెందిన అజీమ్‌ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు అందిస్తున్న అద్వితీయ అవకాశం. విద్యా విద్యా సంవత్సరం యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్‌ వెలువరించింది.

ఆదాయాన్ని అనుసరించి కొందరికి ఉచితంగా, ఇంకొందరికి రాయితీలత కోర్సులను అందిస్తోంది. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతోపాటు వారిలో సామాజిక స్పృహ పెంచడానికి అజీం ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయం కృష్టి చేస్తోంది.

మేటి ఫ్యాకల్టీ, ఆధునిక వసతులు, ఆహ్లాదకరమైన వాతావరణంలాంటి ప్రత్యేకతలతో బెంగళూరులో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటైంది. సమాజానికి నాణ్యమైన మానవ వనరులు అందించే లక్ష్యంతో కోర్సులను రూపొందించారు.

సైన్సెస్‌, ఆర్ట్స్‌, హ్యుమానిటీస్‌, న్యాయవిద్య, బోధన రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ సంస్థలో చదవడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. అన్నికోర్సులవారికీ కామన్‌ కరిక్యులమ్‌తోపాఉట ప్రతి కోర్సులోనూ మేజర్‌ (కంపల్సరీ), ఎలెక్టివ్‌లు ఉంటాయి.

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/