ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ -2020

Engineering services exams 2020

ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ (ఈఎస్‌ఈ) ప్రకటన ఇటీవల విడుదలైంది.ఇంజినీరింగ్‌ గ్రా డ్యుయేట్లు ప్రతిష్టాత్మకంగా భావిస్తూ రాయాలని ఉత్సాహపడే పరీక్ష ఇది. యూపిఎస్‌సి దీన్ని ఏటా నిర్వహిస్తుంది. ఐఎస్‌ తరహాలో దీన్ని ఐఇఎస్‌ అని వ్యవహరిస్తారు. తాజా నోటిపికేషన్‌ ద్వారా కేంద్రప్రభుత్వ సర్వీసుల్లో 495 ఖాళీలు పూర్తి చేయనున్నారు. సమాజంలో మంచి గౌర వం, అత్యున్నత స్థాయికి చేరుకొనే పదోన్నతులు. ,ఉద్యోగ భద్రత, సంతృప్తి, ఐఇఎస్‌ ప్రత్యేకతలు, మూడు దశల్లో జరిగే ఈపరీక్ష నెగ్గటానికి నేర్చుకోవాల్సిన మెలకువలను తెలుసుకుందాం.

జాతీయ స్థాయిలో వివిధ శాఖల్లో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరు, అసిస్టెంట్‌ ఇంజినీరు లాంటి గూపు ఎ ఉద్యోగాల భర్తీ కోసం యుపిఎస్‌సి ఇఎస్‌ఇ ని నిర్వహిస్తోంది. సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలి కమ్యూనికేషన్‌ విభాగాల్లో ఈ పరీక్ష ఉంటుంది (ఈ విభాగాల్లో కొత్తగా కొన్ని సర్వీసులను చేర్చ టం.కొన్నింటిని తొలిగించటం చేశారు),

ఇండి యన్‌ రైల్వే, సెంట్రల్‌ పబ్లిక్‌ వర్క్స్‌, మిటిటరీ ఇంజినీరింగ్‌, సెంట్రల్‌ వాటర్‌, ఇంజినీరింగ్‌, నావల్‌, సెంట్రల్‌ పవర్‌ టెలికాం, బోర్డర్‌ రోడ్డు ఇంజినీరింగ సర్వీసెస్‌, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, స్కిల్స్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌, ఆర్డినెన్‌స,ఫాక్టరీస్‌ వంటి వివిధ విభాగాల్లో దీని ద్వారా నియామకాలు జరుగుతాయి. ఇంజినీరిం గ్‌లలో ఏదైనా డిగ్రీ/ఎంఎస్‌సి చదివినవారు ఈ పరీక్ష రాయటానికి అర్హులు, అభ్యర్ధుల సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ సబ్జెక్టుల్లో ఏదో ఇకదాన్ని ఎంచుకోవాలి. బి,ఇ/ బి.టెక్‌ చివరి సంవత్సరం విద్యార్ధులు కూడా పరీ క్ష రాయవచ్చు.

పరీక్షరాసే సంవత్సరపు జనవరి1వ తేదీకి 21 నుంచి30 సంవత్సరాల వయసు ఉండాలి. కొన్ని కేటగిరీల అభ్యర్ధులకు వయసులో సడలింపు ఉంటుంది. ఐఐటి ఎన్‌ఐటి లాంటి ప్రసిద్ధ కళాశాలల్లో చదివినవారూ, ఇంజి నీరింగ్‌లో తక్కువ శాతం మార్కులతో ఉత్తీర్ణులైనవారు ఎంతోమంది ఈ పరీక్షలో మంచి విజయం సాధిస్తున్నారు. కష్టపడి చదివి, అవగాహనతో సంసిద్ధమైతే ఈఎస్‌ఇలో మంచి ర్యాంకు తెచ్చుకోవటం సగటు విద్యార్ధికి అసాధ్యమేమీ కాదు,
దరఖాస్తు ఎప్పటిలోగా? ఆన్‌లైన్‌లో …..

వెబ్‌సైట్‌ నుచి మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. – అభ్యర్ధులు రిజస్ట్రేషన్‌ చేసుకుంటున్నప్పుడు పరీక్ష కేంద్రాన్ని , ఇంజినీరింగ్‌ డిసిప్లిన్‌నూ జాగ్రత్తగా ఎంచుకోవాలి. రిజిస్ట్రేషన్‌ తరువాత ఈ రెండూ మార్చుకునే అవకాశం లేదు
-ఆన్‌లైన్‌ పద్ధతిలో పరీక్ష రుసుము చెల్లివచి దరఖాస్తు చేసుకోవటానిక చివరి తేది: 15-10-2019

  • ఈఎన్‌ఆ ప్రిలిమ్స/ స్టేజ్‌-1 పరీక్ష: జనవరి 5,2020.
    ఈ ఎస్‌ఈ మెయిన్స్‌/ స్టెజ్‌-2 పరీక్ష జాన్‌ 28, 2020.
    పరీక్ష రుసుము రూ.200 మహాళా అభ్యర్ధులూ, ఎస్సీ, ఎసీ వికలాంగులూ పరీక్ష రుసుమును చెల్లించనక్కర్లేదు.

తాజా ఆధ్యాత్మికం వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/specials/devotional/