విద్యుత్‌ రంగంలో ఉపాధి అవకాశాలు

Power Sector

ఆధునిక కాలంలో విద్యుత్‌కు ఉన్న విలువ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఐదునిమిషాలు కరెంటు లేకపోతే అల్లాడిపోతాం. ఉదయం టిఫన్‌ మొదలుకొని రాత్రి పడుకునేంత వరకు కరెంటుతో ఎన్నో పనులుంటాయి. అంటే మనకు రోజంతా విద్యుత్‌ ఉండాలంటే అందుకు తగిన సిబ్బంది, సాంకేతిక నైపుణ్యత గల నిపుణుల అవసరం ఉంది.

విద్యుత్‌ ఎలక్ట్రిసిటీ కరెంట్‌. నిరంతరాయ విద్యుత్‌ సరఫరా చేసేందుకు ఎన్నో పథకాలు.. సంప్రదాయ థర్మల్‌ విద్యుత్‌, హైడ్రో పవర్‌ జనరేషన్‌ నుంచి సోలార్‌ పవర్‌, న్యూక్లియర్‌ పవర్‌, విండ్‌ ఎనర్జీ ఉత్పత్తి వరకూ విద్యుత్‌ ఉత్పత్తికి వందల సంఖ్యలో ప్లాంట్లకు అనుమతులు ఇవే ఇప్పుడు యువతకు ఉద్యోగాలపరంగావంగా మారాయి అంటున్నారు నిపుణులు. ఐటిఐ, డిప్లొమా, బిటెక్‌, ఎంటెక్‌, ఎంబిఎ వంటి ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థులకు అవకాశాల వేదికగా మారుతోంది విద్యుత్‌రంగం. విద్యుత్‌ రంగంలో కొలువులు అందిపుచ్చుకునేందుకు మార్గాలు.. అర్హతలు, నైపుణ్యాల గురించి తెలుసుకుందాం.

పవర్‌ సెక్టార్:

దేశ అభివృద్ధిలో కీలకరంగం. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ ఉత్పత్తిని పెంచేందుకు పలు కొత్త పథకాలు అమల్లోకి తెచ్చాయి. గ్రీన్‌ బిల్డింగ్‌ ఎనర్జీ ఇనీషియేటివ్‌, క్లీన్‌ ఎనర్జీమిషన్‌, నేషనల్‌ పాలసీ ఆన్‌ బయోవ్యూయల్స్‌, ఉద§్‌ుస్కీమ్‌, పవర్‌ ఫర్‌ ఆల్‌, సౌభాగ్యస్కీమ్‌ వంటివి ముఖ్యమైనవి. పరిశ్రమల నుంచి గృహ వినియోదారుల వరకూ నిరంతరాయ విద్యుత్‌ అందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పలు విధానాలు రూపొందించింది.

ఫలితంగా దేశంలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల సంఖ్య ఏటాటా పెరుగుతోంది. శక్తిఉత్పాదన కోసం ప్రభుత్వం విస్తృతంగా చర్యలు చేపడుతోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో 344 రిగావాట్ల సామర్థ్యంతో భారత్‌ ప్రపంచంలోనే అయిదో పెద్ద దేశంగా నిలిచింది. విద్యుత్‌ ఉత్పత్తిపరంగా మూడోపెద్ద దేశమనే ఘనత కూడా సాధించింది. ఇది దేశంలో విద్యుత్‌రంగం విస్తరణ తీరుకు నిదర్శంగా చెప్పొచ్చు.

క్లీన్‌ ఎనర్జీతో కొలువులు:

ప్రస్తుతం విద్యుత్‌రంగంలో క్లీన్‌ ఎనర్జీ విధానం కీలకంగా మారింది. ప్యారిస్‌ అగ్రిమెంట్‌ ఆన్‌ క్లీన్‌ ఎనర్జీ లక్ష్యాలను చేరుకునేందుకు రూపొందించిన క్లీన్‌ ఎనర్జీ మిషన్‌ పేరిట పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టిసారించింది. ఫలితంగా సౌరవిద్యుత్‌, పవన విద్యుత్‌ (విండ్‌ పవర్‌), బయో-ఫ్యూయల్స్‌, హైడ్రోపవర్‌ విభాగాల్లో వందల సంఖ్యలో విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల స్థాపన జరుగుతోంది. హైడ్రోపవర్‌ విభాగంలో ఇటీవల నిబంధనలు సరళీకృతం చేయడంతోపాటు ప్రభుత్వం పలు ప్రోత్సాహకాలు సైతం అందిస్తోంది. గ

తంలో 25 మెగావాట్ల సామర్థ్యం ఉన్న జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు పలు రాయితీలు లభించేవి. తాజాగా ఇంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న జలవిద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు సైతం ప్రోత్సాహకాలు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. దాంతో వీటిని ఏర్పాటు చేసేందుకు సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఇవన్నీ కూడా యువతకు ఉద్యోగాలకు వేదికగా నిలుస్తున్నాయి.

పెరుగుతున్న అవకాశాలు:

ప్రభుత్వ, ప్రైవేటు రంగాలతోపాటు పిపిపి విధానంలో ప్రతిఏటా వందల సంఖ్యలో విద్యుత్‌ ఉత్పాదన కేంద్రాలు ఏర్పాటవుతున్నాయి. ఇవి ఉపాధి మార్గాలు, ఉద్యోగావకాశాల పరంగా యువతకుపరంగా మారాయి. లక్షల సంఖ్యలో కొలువులను వేదికగా నిలుస్తున్నాయి. ఫలితంగా ఐటిఐ నుంచి ఎంటెక్‌, ఎంబిఎ, కాస్ట్‌ అకౌంటెన్సీ, పవర్‌ మేనేజర్‌మెంటే..ఇలా అన్ని కోర్సుల విద్యార్థులకు ఇప్పుడు విద్యుత్‌రంగం కొలువుల కామధేనువుగా నిలుస్తోంది అంటున్నారు నిపుణులు.

భారీ సంఖ్యలో జాబ్స్‌:

ప్రస్తుతం దేశంలో పనరుత్పాదక విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు ప్రాధాన్యం పెరిగింది. ఫలితంగా ఈ రంగంలో భారత్‌ కొలువులపరంగా అంతర్జాతీయంగా టాప్‌-10లో నిలుస్తోంది. ఇంటర్నేషనల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఏజెన్సీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం-2018లో అంతర్జాతీయంగా 11 మిలియన్ల ఉద్యోగాలు లభించగా ఒక్క భారత్‌లోనే ఆ సంఖ్య 7.19 లక్షలుగా ఉండటం విశేషం. హైడ్రోపవర విభాగంలో 3.47 లక్షలు. సోలార్‌ పవర విభాగంలో 1.15 లక్షలు, విండ్‌పవర సెక్టార్‌లో 58వేల ఉద్యోగాలు లభించాయి. ఇదే ధోరణి కొనసాగితే 2022నాటికి భారత్‌లోని సోలార్‌, విండ్‌పవర్‌ సెక్టార్స్‌లో మరో మూడులక్షల కొత్త ఉద్యోగాలు లభిస్తాయని ఇంటర్నేషనల్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ఏజెన్సీ అంచనా వేసింది.

సంప్రదాయ ఇంధనరంగంలో ఇలా:

సంప్రదాయ ఇంధన ఉత్పత్తి కేంద్రాలుగా భావించే థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్స్‌లో ప్రస్తుతం 1.2 మిలియన్ల మంది పని చేస్తున్నారు. రానున్న మూడేళ్లలో అదనంగా మరో రెండు లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని ఫీక్కి, అసోచామ్‌ వంటి సంస్థల అంచనా. థర్మల్‌ పవర్‌ జనరేషన్‌కు అవసరమైన బొగ్గు వనరుల లభ్యత తగ్గుతోంది. దాంతో భవిష్యత్తులో రెన్యువబుల్‌ ఎనర్జీ విభాగాలే కీలకంగా నిలుస్తాయి. ఫలితంగా ఈ విభాగాల్లోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తున్నారు. మొత్తం విద్యుత్‌ రంగంలోని ఉద్యోగాల్లో పునరుత్పాదక రంగంలో కొలువులు 70శాతం మేరకు ఉంటాయని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ ఉత్పత్తిపరంగా ప్రాధాన్యం సంతరించుకున్న మరో విభాగం. న్యూక్లియర్‌ ఎనర్జీ. మనదేశంలో న్యూక్లియర్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం ప్రత్యేక పథకాలు అమలవుతు న్నాయి. వచ్చే ఏడాది చివరినాటికి న్యూక్లియర్‌ ఎనర్జీ ఉత్పత్తికి 20వేల మెగావాట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికి అనుగుణంగా కొత్తగా న్యూక్లియర్‌ రియాక్టర్‌ కేంద్రాలను నెలకొల్పాలని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా నిర్ణయించింది. వీటిద్వారా వచ్చే ఏడాది చివరి నాటికి మరో యాభైవేల కొత్త ఉద్యోగాలు లభించే అవకాశముంది.

వర్‌ అండ్‌ ఎనర్జీ విభాగంలో భారీగా ఉద్యోగాలు లభిస్తాయని టీమ్‌లీజ్‌ సర్వీసెస్‌ వంటి సంస్థల నివేదికలు వెల్లడిస్తున్నాయి. తాజా అంచనాల ప్రకారం-2018-2019 ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థానికి ఈ రంగంలో మొత్తం 15.6 లక్షల ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో కొత్తగా 35 వేలకు పైగా కొలువులు లభించనున్నాయి. మొత్తంగా చూస్తే ఈ విభాగం నియామకాలపరంగా 13.82శాతం వృద్ధి సాధించింది. ఇదే పంధా భవిష్యత్తులోనూ కొనసాగనుంది.

ప్రధాన ఉపాధి వేదికలు:

జలవిద్యుత్‌ కేంద్రాలు, సోలార్‌ పవరజనరేషన్‌ కంపెనీలు, విండ్‌ పవర జనరేషన్‌ సంస్థలు, ధర్మల్‌ పవర్‌ జనరేషన్‌ సంస్థలు, ప్రభుత్వ విభాగాల్లోని డిస్కమ్‌లు, ట్రాన్స్‌కో.

ఉపాధి అవకాశాలు:

ప్లాంట్‌ అసిస్టెంట్‌, ఆపరేటర్‌, టెక్నీషియన్‌ సూపర్‌వైజర్‌, ఇంజనీర్‌, ప్రొడక్షన్‌ ఆఫీసర్‌, ప్లాంట్‌ డిజైన్‌ ఇంజనీర్‌, ప్లానింగ్‌ ఇంజనీర్‌. వీటిలో ప్లాంట్‌ అసిస్టెంట్‌ నుంచి టెక్నీ షియన్‌ వరకు క్షేత్రస్థాయి ఉద్యోగాలకు ఐటిఐ (ఎలక్ట్రికల్‌) అర్హత ఉండాలి. సూపర్‌వైజర్‌ స్థాయి కొలువులకు డిప్లొమా, ఇంజనీర్‌ హోదా పొందేందుకు బిటెక్‌ (ఎలక్ట్రికల్‌) తప్పనిసరి.

ఉన్నతస్థాయి ఉద్యోగాలపరంగా ఎంటెక్‌లో పవర్‌సిస్టమ్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ స్పెషలైనేఝన్‌ ఉత్తీర్ణులకు అవకాశం కల్పిస్తారు. ప్రభుత్వ విభాగాల్లోని ట్రాన్స్‌కోలు, డిస్కమ్‌లలో ఎఎల్‌ఎం (అసిస్టెంట్‌ లైన్‌మెన్‌), జెఎల్‌ఎం (జూనియర్‌ లైన్‌మెన్‌), సబ్‌-ఇంజనీర్‌, ఎఇఇ ఉద్యోగాలకు నేరుగా నియామకాలు చేపడతారు.

వీటిలో ఎఎల్‌ఎం, జెఎల్‌ఎం పోస్ట్‌లకు ఐటిఐ అర ్హతతో పోటీపడొచ్చు. సబ్‌ ఇంజనీర్‌, ఎఇఇ ఉద్యోగాలకు డిప్లొమా, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ అర్హతలతో పోటీపడొచ్చు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/