ఏపీపీఎస్సీ పరీక్షల తేదీల్లో మార్పులు

online-exams
online-exams

అమరావతి: ఏపిలో ఉద్యోగ నియామకాల ప్రధాన రాత పరీక్ష (ఆన్‌లైన్‌)ల తేదీల్లో మార్పులు జరిగాయి. ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌1 పరీక్షను ఏప్రిల్‌ 25 నుంచి అదే నెల 29కి వాయిదా వేశారు. అసిస్టెంట్‌ తెలుగు ట్రాన్స్‌లేటర్‌ పరీక్షను ఏప్రిల్‌ 25న కాకుండా అదే నెల 29, 30 తేదీల్లో నిర్వహించనున్నారు. రీసెర్చి ఆఫీసర్‌ పరీక్షను ఏప్రిల్‌ 25న కాకుండా అదేనెల 28, 29లలో, అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ పరీక్షను ఏప్రిల్‌ 17న కాకుండా ఏప్రిల్‌ 29, 30 తేదీల్లో జరుపుతామని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఏఈఈ పరీక్షను ఏప్రిల్‌ 29, 30న కాకుండా మే 14, 15 తేదీల్లో జరుపుతారు. ఏప్రిల్‌ 3,4 తేదీల్లో జరగాల్సిన అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌ పరీక్షను మే 14, 15 తేదీల్లో నిర్వహించనున్నారు. జూన్‌ 2 నుంచి జరగాల్సిన ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షను అదేనెల 9న, ఫారెస్ట్‌ బీట్‌ ఆఫీసర్‌ అండ్‌ అసిస్టెంట్‌ బీట్‌ ఆఫీసర్‌ స్క్రీనింగ్‌ పరీక్షను మే 26 నుంచి జూన్‌ 16వ తేదీకి వాయిదా వేశారు.


మరిన్ని కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/