మరోసారి వాయిదా పడిన గ్రూప్‌-1 పరీక్ష

APPSC Group-1
APPSC Group-1

అమరావతి: ఏపిలో జరగాల్సిన గ్రూప్‌1 ప్రిలిమిన‌రీ ప‌రీక్ష మరోసారి వాయిదా పడింది. నిజానికి ఈ పరీక్ష మార్చి 31న జరగాల్సి ఉంది. అయితే, దీనిని మే 26కు వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ బుధవారం సాయంత్రం ఓ ప్రకటనను విడుదల చేసింది ఈ నిర్ణయాన్ని గ్రూప్1 అభ్యర్థులు స్వాగతిస్తున్నారు. పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు మరింత సమయం దొరికిందని ఆనందపడుతున్నారు.వాస్తవానికి గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష మార్చి 10న జరుగుతుందని ఏపీపీఎస్సీ మొదట ప్రకటించింది. అయితే, ఆ సమయంలో అభ్యర్థులు దీనిని వాయిదా వేయమని కోరడంతో మార్చి 31కి మార్చారు. ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ వెలవడడంతో ఈ సారి ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. దీంతో జూన్ 10 నుంచి 22 వరకు జరిగే మెయిన్స్ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 169 గ్రూప్1 పోస్టుల కోసం 1.14 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.


మరిన్ని తాజా కెరీర్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/specials/career/