పీజీ వైద్య విద్యలో ప్రవేశాలకు దరఖాస్తులు

medicine
medicine


హైదరాబాద్‌: పీజీ వైద్య విద్య, ఎండీఎస్‌ కోర్సుల్లో ప్రైవేటు, మైనారిటీ మెడికల్‌ కాలేజీల్లో మేనేజ్‌మెంట్‌ కోటాలో ప్రవేశాలకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. నీట్‌ పీజీ-2019లో అర్హత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని ప్రకటించింది. పీజీకి దరఖాస్తు చేసుకునే ఎంబీబీఎస్‌ విద్యార్థులు మార్చి 31 నాటికి తమ ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసి ఉండాలని పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు ఏప్రిల్‌ 7నుంచి 15 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.