న్యాయవాద వృత్తిలో అద్భుత ప్రతిభ

Advocacy profession

ఈరోజుల్లో లా అంటే..ఏదో కోర్టులో సివిల్‌ లేదా క్రిమినల్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం ఒక్కటే కాదు. కంపెనీలు, కార్పొరేట్‌ ప్రపంచం విస్తృతి కారణంగా ప్రస్తుతం లా ఆ పరిధి దాటేసింది. అందుకే ప్రత్యేక అర్హతలు కలిగిన వ్యక్తులు కార్పొరేట్‌ సంస్థలకు అవసరపడుతున్నారు. ప్రస్తుతం లా గ్రాడ్యు యేట్లు కార్పోరేట్‌ అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.

ముఖ్యంగా సైబర్‌ లా, ఐపిఎఆర్‌, కార్పొరేట్‌ లా నిపుణులకు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.

ఇటీవల దిశ, నిర్భయ కేసుల సంఘటనలతో ప్రతిపౌరుడిని న్యాయస్థానాల తీర్పులపై ఆసక్తిని రేపుతున్నది. జిల్లాకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టులపై అవగాహనను పెంచుకుంటున్నారు.

అంతేకాదు న్యాయవాద వృత్తిపై కూడా ఇష్టాన్ని కలిగివ్ఞంటున్నారు. అంతేకాదు ఆస్తుల తగాదాలు, క్రైమ్‌, ప్రభుత్వ, ప్రైవేటుపరమైన గొడవలు, జివోలతో కోర్టులను ఆశ్రయించేవారి శాతం పెరుగుతున్నది. కేసులు పెరుగుతున్నా అంతేస్థాయిలో వాటిని విచారించి, తీర్పుచెప్పేందుకు జడ్జిలు, న్యాయవాదులు లేరు. దీంతో కేసులు నెలలు, సంవత్సరాల తరబడి వాయిదాలపై కాలం సాగిపోతున్నది. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశాలన్నింట్లో ఎన్నో కొత్త కంపెనీలు, సంస్థలు పుట్టుకొస్తుంటాయి.

వాటి రోజువారీ నిర్వహణలో భాగంగా చట్టపరంగా ఎన్నో అంశాలపై ఆధారపడటం, జాగ్రత్తలు తీసుకోవడం, సమస్యలను ఎదుర్కోవడం వంటి అనేక కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇవన్నీ సాధారణ చదువులు చదివిన వ్యక్తి చేయలేరు. వీటికి సంబంధించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నా, సంస్థకు సరైన సలహా ఇచ్చి మార్గదర్శనం చేయాలన్నా న్యాయశాస్త్రంపై అవగాహన ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యం అందువల్ల రోజురోజుకు వివిధ రంగాల్లో న్యాయశాస్త్ర నిపుణులకు అవకాశాలు పెరగబోతున్నాయి.

ఉద్యోగులు, మేనేజ్‌మెంట్‌ మధ్య ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడం, కంపెనీలకు, బయిటి వ్యక్తులు లేదా ఇతర కంపెనీలతో తలెత్తే ఇబ్బందులను పరిష్కరించడం వంటివి చేయాలంటే చట్టాలపై పట్టు ఉన్న వ్యక్తుల అవసరం ఎంతో ఉంది.
క్రిమినల్‌ లాయర్లు ఒక్కటే కాదు: ఈరోజుల్లో లా అంటే..ఏదో కోర్టులో సివిల్‌ లేదా క్రిమినల్‌ లాయర్‌గా ప్రాక్టీస్‌ చేయడం ఒక్కటే కాదు. కంపెనీలు, కార్పొరేట్‌ ప్రపంచం విస్తృతి కారణంగా ప్రస్తుతం లా ఆ పరిధి దాటేసింది. అందుకే ప్రత్యేక అర్హతలు కలిగిన వ్యక్తులు కార్పొరేట్‌ సంస్థలకు అవసరపడుతున్నారు.

ప్రస్తుతం లా గ్రాడ్యు యేట్లు కార్పోరేట్‌ అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ముఖ్యంగా సైబర్‌ లా, ఐపిఎఆర్‌, కార్పొరేట్‌ లా నిపుణులకు జాబ్‌ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి.
లా చేయడం వల్ల అదనపు అర్హత…ప్రయోజనం.

సిఏ, సిఎస్‌ వంటి ప్రొఫెషనల్‌ కోర్సులు పూర్తి చేసిన వారు న్యాయవిద్యను అభ్యసించడానికి అదనపు ప్రయోజనంగా భావిస్తున్నారు. క్లాట్‌ అడ్మిషన్‌ పరంగా ఈనేపథ్యం ఉన్నవారి సంఖ్య అయిదు నుంచి పది శాతం మధ్యలో ఉంటోంది. మిగతా వారు కూడా తమకు స్థానికంగా అందుబాటు లో ఉన్న కళాశాలల్లో న్యాయ విద్యను అభ్యసిస్తున్నారు. దీనివల్ల వారికి వృత్తిపరంగా ఎదురయ్యే న్యాయ సమస్యలపై అవగాహన ఏర్పడుతుంది. ఫలితంగా తమ వృత్తిలో మరింత ఉన్నతంగా రాణించేందుకు అవకాశం ఉంటుంది.

న్యాయవిద్యను అభ్యసించేవారికి విశ్లేషణ…ప్రాక్టికాలిటీ అవసరం.

న్యాయ విద్యలో అడుగు పెట్టాలంటే విద్యార్థులకు ఉండాల్సిన ప్రధాన లక్షణం. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించగల సామర్థ్యం. అదేవిధంగా నిరంతరం చట్టాల్లో వస్తున్న మార్పులు గురించి అధ్యయనం చేయగలిగే విధంగా సెల్ఫ్‌ లెర్నింగ్‌ దృక్పథంతో అలవరుచుకోవాలి. కోర్సు చేస్తున్నప్పుడే ప్రాక్టికల్‌ ఓరియెంటేషన్‌తో అడుగులు వేయాలి. కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు ఇంటిగ్రేడెట్‌ లా కోర్సులు అందిస్తున్నాయి. దీనికి కారణం విద్యార్థుకలు ముందునుంచే ఈ కోర్సు, ప్రొఫెషన్‌పై బలమైన పునాది ఏర్పరిచేందుకు నిర్వహిస్తున్నారు. లా ఎక్స్‌పర్ట్‌గా మారాలి అనుకునే విద్యార్థులు ప్రధానంగా మూడు పరీక్షలను దృష్టిలో ఉంచుకోవాలి. ఇవి జాతీయ స్థాయిలో లా స్కూళ్లలో ప్రవేశానికి ఉద్ధేశించిన పరీక్షలు. ఈక్రింద
ఇవ్వబడ్డాయి.

క్లాట్‌ (సిఎల్‌ఏటి) ప్రవేశ పరీక్ష:

ఇంజనీరింగ్‌కు ఐఐటి, మేనేజ్‌మెంట్‌కు ఐఐఎం ఎంత ప్రముఖ సంస్థలో న్యాయవిద్యకు నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎస్‌ఎల్‌యూ)లు అంత గొప్ప విద్యాసంస్థలు. ఏఎస్‌ఎల్‌యూలో ప్రవేశం దొరికినా భవిష్యత్‌ అద్భుతంగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. హైదరాబాద్‌లో కూడా నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా అని ఓఎన్‌ఎల్‌యూ ఉంది. దేశంలోని అని ఎన్‌ఎల్‌యూల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష. కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌). ఇంటర్మీడియట్‌లో 45శాతం మార్కులు వచ్చిన ఎవరైనా ఈ పరీక్ష రాయవచ్చు. పరీక్ష ఆన్‌లైన్‌లోనూ మాత్రమే జరుగుతుంది. ఎన్‌ఎల్‌యూల్లో సుమారు 2400సీట్లు ఉంటాయి. వీటి కోసం ప్రతి సంవత్సరం దాదాపు 50వేల మంది వరకు పోటీపడతారు.

ఏఐఎల్‌ఈటి ఎంట్రన్స్‌:

ఇది ఢిల్లీ నేషనల్‌ లా యూనివర్సిటీ ప్రవేశం కోసమే ఉద్ధేశించిన ప్రత్యేక ప్రవేశ పరీక్ష. కేవలం 83 సీట్లు మాత్రమే ఉన్న ఈసంస్థలో ప్రవేశం కోసం సుమారు 20వేల మంది వరకు పోటీపడతారు. ఎందుకంటే ఢిల్లీ ఎన్‌ఎల్‌యూలో డిగ్రీ చేయడానికి ప్రవేశం లభిస్తే…సుప్రీంకోర్టు, ఢిల్లీ హైకోర్టు వంటి ప్రధాన కోర్టుల్లో పనిచేసే న్యాయనిపుణుల ప్రసంగాలు వినే అవకాశం లభిస్తుంది. ఇతర ఎన్‌ఎల్‌యూలకు లేని గొప్ప అవకాశం ఇది. అందుకే తక్కువ సీట్లు ఉన్నప్పటికీ ఈపరీక్షకు అంతపోటీ.

దేశ వ్యాప్తంగా ఉన్న 85 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థల్లో ప్రవేశానికి ఉద్ధేశించిన పరీక్ష లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్టు (ఎల్‌ శాట్‌). ఇది కూడా ఆఫ్‌లైన్‌ పరీక్ష. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలు కూడా ఆయా రాష్ట్రాల్లోని కళాశాలలు, యూనివర్సిటీల్లో ప్రవేశాలకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తాయి. అవే ఎపి లాసెట్‌, టిఎస్‌ లాసెట్‌. ఎపి లాసెట్‌ను ప్రతి ఏడాది ఒక్కో యూనివర్సిటీ నిర్వహిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్‌లో దాదాపు 3000 లా సీట్ల కోసం నిర్వహించే ఈపరీక్ష ద్వారా 33 విద్యాసంస్థ ల్లో ప్రవేశాలు జరుగుతాయి. ఇక టిఎస్‌ లాసెట్‌ ద్వారా 22 కళాశాలల్లో ప్రవేశాలు జరుగుతాయి. దాదాపు 4,500 సీట్లు ఈపరీక్ష ద్వారా భర్తీ అవుతాయి.

తాజా ఎన్నారై వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/nri/