అగ్రికల్చర్‌ కోర్సుల నోటిఫికేషన్‌

కెరీర్ గైడెన్స్

Agriculture Courses

దేశవ్యాప్తంగా వివిధ వ్యవసాయ విశ్వవిద్యాలయాలు వ్యవసాయం దాని అనుబంధ విభాగాల్లో బిఎస్సీ, ఎమ్మెస్సీ, పిహెచ్‌డి కోర్సులను అందిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకి రాష్ట్రాల వారీగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

కానీ దేశంలోని ప్రతి సంస్థలోనూ ఆయా డిగ్రీల వారీగా 15 నుంచి 25 శాతం సీట్లను జాతీయస్థాయిలో నిర్వహించే పరీక్షలతో భర్తీ చేస్తారు. కొన్ని జాతీయ సంస్థల్లో మొత్తం సీట్లకు ఆ పరీక్షల స్కోరే ప్రామాణికం. ఈవిధానంలో ప్రవేశాలు పొందినవారు ప్రతి నెల స్టైపెండ్‌ అందుకోవచ్చు. ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ (ఐకార్‌) ఆధ్వర్యంలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఈ పరీక్షలను నిర్వహిస్తోంది. ప్రస్తుతం ప్రకటన వెలువడింది.

అగ్రికల్చర్‌ యూజీ: యూజీ కోర్సులకు నిర్వహించే పరీక్ష ద్వారా సెంట్రల్‌ అగ్రికల్చరల్‌ యూని వర్సిటీలు పూసా, రాంచీ, నేషనల్‌ డెయిరీ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కర్నాల్‌లో ఉన్న మొత్తం యూజీసీసీట్లను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. దేశంలోని 74 వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 15 శాతం యూజీ సీట్లకు పోటీ పడటానికి ఈ పరీక్ష రాయడం తప్పనిసరి. మొత్తం 11 బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు.

బీఎస్సీ: అగ్రికల్చర్‌, హార్టికల్చర్‌, ఫిషరీ సైన్స్‌, ఫారెస్ట్రీ, కమ్యూనిటీ సైన్స్‌, ఫుడ్‌ న్యూట్రిషన్‌ అండ్‌ డైటెటిక్స్‌, సెరికల్చర్‌.

బిటెక్‌: అగ్రికల్చరర్‌ ఇంజినీరింగ్‌, డెయిరీ టెక్నాలజీ, ఫుడ్‌ టెక్నాలజీ, బయో టెక్నాలజీ కోర్సులు. వీటిని పలు సంస్థల్లో అందిస్తున్నారు. కోర్సులను బట్టి బైపిసి లేదా ఎంపిసిలతో ఇంటర్‌ పూర్తి చేసినవారు అర్హలు. కొన్ని కోర్సులకు రెండు గ్రూపుల వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర రాష్ట్రాల సంస్థల్లో చేరిన అర్హులు. ఇతర రాష్ట్రాల సంస్థల్లో చేరిన విద్యార్థులకు ప్రతి నెల రూ.2000 స్టైపెండ్‌ అందిస్తారు.

అర్హత: కనీసం 50 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు (40) శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత, ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాస్తున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష విధానం: వ్యవధి రెండున్నర గంటలు. ఒక్కో సబ్జెక్టు నుంచి 50 చొప్పున మొత్తం 150 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.

పిజి కోర్సులు: పిజి కోర్సులకు నిర్వహించే పరీక్ష ద్వారా దేశవ్యాప్తంగా పిజి స్థాయిలో 20 విభాగాల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. మెరిట్‌ సాధించిన 600 మంది విద్యార్థులకు ఐసిఎఆర్‌ పిజి స్కాలర్‌షిప్‌ అందుతుంది. దీనిప్రకారం నెలకు రూ.12,400 స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇది అందనివారికి నేషనల్‌ టాలెంట్‌ స్కాలర్‌షిప్‌ కింద ప్రతి నెలా రూ.5000 ఇస్తారు.

అర్హత: అగ్రికల్చర్‌, అనుబంధ విభాగాల్లో 60 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 50) శాతం మార్కులతో యూజీ కోర్సులు పూర్తిచేసిన వారు, ఆఖరు సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు.

పరీక్ష తీరు: పిజి పరీక్ష వ్యవధి రెండు గంటలు. సంబంధిత సబ్జెక్టుల నుంచి 120 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికీ ఒక మార్కు తగ్గిస్తారు.

ఐకార్‌-ప్రవేశపరీక్షల ప్రకటన విడుదల

జెఆర్‌ఎఫ్‌/ఎన్‌ఆర్‌ఎఫ్‌: దేశంలో ఉన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో 25శాతం, మరో అయిదు సంస్థల్లో వందశాతం పిహెచ్‌డి (జెఆర్‌ఎఫ్‌/ ఎస్‌ఆర్‌ఎఫ్‌) సీట్లను ఐసిఎఆర్‌ ఆలిండియా కాంపిటిటీవ్‌ ఎగ్జామినేషన్‌తో భర్తీ చేస్తారు. పూర్తి వివరాల కోసం క్యూఆర్‌కోడ్‌ స్కాన్‌ చేయవచ్చు.
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేదీ: మార్చి 31 (అన్ని కోర్సులకూ)
పరీక్ష తేదీ: జూన్‌ 1 (యూజి, పిజి, పిహెచ్‌డి)

https://www.icor.nta.nic.in

తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/