ఇంజినీరింగ్‌ ఫీజులు తాత్కాలిక పెంపు!

students
students

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులను తాత్కాలికంగా పెంచేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటి (టిఏఎఫ్‌ఆర్‌సీ) అవకాశం కల్పిస్తూ చేసిన ప్రతిపాదనను కళాశాలలు అంగీకరించాయి. ఈ సందర్భంగా ఈరోజు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలతో జరిగిన భేటీలో ఫీజులను 15 నుంచి 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ ప్రతిపాదించింది. ప్రస్తుతం రూ.50వేలు లోపు ఉన్న ఫీజులను 20శాతం పెంచేందుకు ఏఎఫ్‌ఆర్‌సీ అంగీకారం తెలిపింది. అలాగే, 50వేలకు మించి ఉన్న ఫీజులను 15శాతం పెంచేందుకు ప్రతిపాదించింది. నెల రోజుల్లో పూర్తిస్థాయి ఫీజులను ఖరారు చేస్తామని స్పష్టంచేసింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/