అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీలో 56 ఖాళీలు

AEES
AEES

ముంబైలోని భారత అణుశక్తి విభాగానికి చెందిన అటామిక్‌ ఎనర్జీ ఎడ్యుకేషన్‌ సొసైటీ దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు/కళాశాలల్లో 57 టీచింగ్‌ పోస్టులకు దరఖాస్తులు కోరింది.
పోస్టుల వివరాలు : 1. పీజీటీ: 3, సబ్జెక్టులు: హిందీ, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ.

 1. టీజీటీ: 21, సబ్జెక్టులు: ఇంగ్లీష్‌, హిందీ, మ్యాథమెటిక్స్‌/ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/బయాలజీ, సోషల్‌ సైన్స్‌
 2. లైబ్రేరియన్‌ : 2
 3. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ : 1
 4. పీఆర్‌టీ : 30
  అర్హత: పోస్టులను బట్టి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌, డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, బీఎల్‌ఐఎస్సీ, లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా/డిగ్రీ, డీఈఎల్‌ఈడీ/డీఎడ్‌, బీఈడీ, సీటెట్‌ ఉత్తీర్ణత.
  ఎంపిక: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
  పరీక్ష తేదీలు: 2019, ఆగస్టు 30,31, సెప్టెంబర్‌ 1 తేదీల్లో ఉంటుంది.
  దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  ఫీజు : రూ. 750. (మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు).
  చివరి తేదీ: జులై 20, 2019
  వెబ్‌సైట్‌: www.aees.gov.in

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/sports/