231 మంది ఎస్సైల‌కు ప‌దోన్న‌తులు

telangana police
telangana police

హైద‌రాబాద్ః పోలీసు శాఖలో పదోన్నతుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే ఇన్‌స్పెక్టర్లు, డీఎస్పీ, అదనపు ఎస్పీలకు ప్రమోషన్లు ఇచ్చిన డీజీపీ.. తాజాగా 231 మంది ఎస్సైలకు ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతలు కల్పిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వెంటనే వారంతా సంబంధిత యూనిట్‌ అధికారులకు రిపోర్టు చేయాలని నిర్దేశించారు. హైదరాబాద్‌ సీపీకి 57 మందిని, రాచకొండ సీపీకి 37 మందిని, ఏసీబీకి 11 మంది, సీఐడీకి 25 మందిని రిపోర్టు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మిగతా అధికారులను వెయిటింగ్‌లో ఉంచారు. కాగా, ఆరో జోన్‌కు చెందిన 231 మంది ఎస్సైలు వెస్ట్‌ జోన్‌ పరిధిలోని జిల్లాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ప్రమోషన్లు పొందిన ఎస్సైలందరూ డీజీపీకి కృతజ్ఞతలు తెలియజేశారు.