హెచ్‌ఏఎల్‌లో అప్రెంటీస్‌లు

HAL
HAL

ఖాళీలు = 877
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌)-నాసిక్‌, బెంగళూరు కేంద్రాల్లో అప్రెంటీసుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది.
నాసిక్‌ హెచ్‌ఏఎల్‌
ఖాళీలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌లు 103, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లు 137, ట్రేడ్‌ అప్రెంటీస్‌లు 577, ఒకేషనల్‌ అప్రెంటీస్‌లు 35.
అర్హత: గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌లు సంబంధిత విభాగంలో బిఈ/ బీటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అయితే ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తయి మూడేళ్లు నిండకూడదు. టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు డిప్లొమా హోల్డర్లు మాత్రమే అర్హులు. ట్రేడ్‌ అప్రెంటీస్‌లకు ఐటీఐ పూర్తిచేసి ఉండాలి. ఒకేషనల్‌ అప్రెంటీస్‌లకు ఇంటర్‌(ఒకేషనల్‌)పూర్తిచేసి ఉండాలి.
స్టయిపెండ్‌: గ్రాడ్యుయేట్‌ అప్రెంటీస్‌లకు నెలకు రూ.4984, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు రూ.3542, ఒకేషనల్‌ అప్రెంటీస్‌లకు రూ.2758, ట్రేడ్‌ అప్రెంటీస్‌లకు నిబంధనల ప్రకారం స్టయిపెండ్‌ చెల్లిస్తారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూలు: ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌, టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు ఏప్రిల్‌ 23, 24న ఒకేషనల్‌ అప్రెంటీస్‌లకు ఏప్రిల్‌ 24న ట్రేడ్‌ అప్రెంటీస్‌లకు ఏప్రిల్‌ 25 నుంచి 28 వరకు ఇంటర్వ్యూలు జరుగుతాయి.
బెంగళూరు హెచ్‌ఏఎల్‌
ఖాళీలు: 25
విభాగం: మెకానికల్‌
ఖాళీలు: డిప్లొమా టెక్నీషియన్‌-2, బీఏఎంఈసీ-1, టెక్నీషియన్‌(ఎలక్ట్రోప్లేటర్‌-2, సీఎన్‌సీ మెషినిస్ట్‌-4, పెయింటర్‌-4, ఫిట్టర్‌-7, హీట్‌ ట్రీట్‌ ఆపరేటర్‌-4, వెల్డర్‌-1)
అర్హత: టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు డిప్లొమా (మెకానికల్‌) ఉత్తీర్ణులై ఉండాలి. బీఏఎంఈసీ అప్రెంటీస్‌లకు బేసిక్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజనీర్‌ సర్టిఫికెట్‌ తోపాటు రోటరీ వింగ్‌/ హెలికాప్టర్స్‌ విభాగాల్లో శిక్షణ లేదా అనుభవం పొంది ఉండాలి. టెక్నీషియన్లకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పూర్తిచేసి ఎన్‌ఏసీ సర్టిఫికెట్‌ పొంది ఉండాలి.
స్టయిపెండ్‌: డిప్లొమా టెక్నీషియన్‌/ బీఏఎంఈసీ అప్రెంటీస్‌లకు రూ.38,410 టెక్నీషియన్‌ అప్రెంటీస్‌లకు రూ.36,615
ఎంపిక: రాత పరీక్ష ద్వారా, పరీక్ష కేంద్రం: బెంగళూరు
దరఖాస్తు ఫీజు: రూ.200
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: మే 1
వెబ్‌సైట్‌: www.hal-india.com