స్పెష‌ల్ కోర్టుకు 30 పోస్టుల మంజూరు

special courts
special courts

హైద‌రాబాద్ః రాష్ట్రంలోని ఎంపీలు, ఎమ్మెల్యేల క్రిమినల్‌ కేసులను విచారించడానికి ఏర్పాటు చేస్తున్న స్పెషల్‌ కోర్టుకు ప్రభుత్వం 30 పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్‌.శివశంకర్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కోర్టు ఏర్పాటుకు సంబంధించి సర్కారు ఇప్పటికే జీఓ జారీ చేసింది. కోర్టుకు జడ్జి పోస్టుతోపాటు ఇతర కేటగిరీల పోస్టులను మంజూరు చేయాలంటూ హోంశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు పోస్టులు మంజూరయ్యాయి. ఒక జిల్లా జడ్జి, మరో చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ పోస్టులతో పాటు 28 ఇతర పోస్టులను మంజూరు చేసింది.