సైన్యంలో ఉద్యోగాలు

army
army

సికింద్రాబాద్‌ బొల్లారంలోని 1 ఈంఈ సెంటర్‌ – సోల్జర్‌ టెక్నీషియన్‌, సోల్జర్‌ ట్రేడ్స్‌మన్‌ నియామకానికి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తోంది. ఎక్స్‌ సర్వీస్‌మెన్/ సర్వీస్‌మెన్‌ల వితంతువులు, సహోదరులు, వారి పిల్లలు, సైన్యంలో పనిచేస్తున్నవారి పిల్లలు ఈ ర్యాలీలో పాల్గొనవచ్చు.
ఉద్యోగాలు: సోల్జర్‌ టెక్నీషియన్‌ (ఏవియేషన్‌), సోల్జర్‌ టెక్నీషియన్‌, సోల్జర్‌ (జనరల్‌ డ్యూటీ, ట్రేడ్స్‌మెన్‌ – టైలర్‌)
వయసు: సోల్జర్‌ టెక్నీషియన్లు, సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌కు 17 1/2 నుంచి 23 ఏళ్ల మధ్య, జనరల్‌ డ్యూటీ విభాగానికి 17 1/2 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి
అర్హత: సోల్జర్‌ టెక్నీషియన్లకు ద్వితీయ శ్రేణి మార్కులతో ఇంటర్‌ (ఎంపీసీ) లేదా డిప్లొమా (మెకానికల్‌ / ఎలక్ట్రికల్‌ / ఆటొమొబైల్స్‌ / కంప్యూటర్‌ సైన్స్‌ / ఎలకా్ట్రనిక్‌ ్క్ష ఇన్‌స్ట్రుమెంటేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. జనరల్‌ డ్యూటీ విభాగానికి 45 శాతం మార్కులతో పదోతరగతి పూర్తిచేసి ఉండాలి. ట్రేడ్స్‌మన్‌ – టైలర్‌ విభాగానికి పదోతరగతి ఉత్తీర్ణతతోపాటు ఐటీఐ (కటింగ్‌ ్క్ష స్యూయింగ్‌) పూర్తిచేసి ఉండాలి.
రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ తేదీ: జూన్‌ 18