సాంఘిక గ‌రుకులాల ప్రిన్సిపాల్ పోస్టుల కేటాయింపు

CAREER
CAREER

అమ‌రావ‌తిః విభజన చట్టం ప్రకారం ఏపీ, తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీల మధ్య ప్రిన్సిపాల్‌ పోస్టుల కేటాయింపులను ఖరారుచేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. జూన్‌ 2014 నాటికి ఉన్న ప్రిన్సిపాళ్ల పోస్టులను ఏపీకి 165, తెలంగాణకు 121 పోస్టులు తాత్కాలికంగా కేటాయించారు. తాజాగా ఏపీకి 144, తెలంగాణకు 94 మందిని కేటాయిస్తూ తుది జాబితాను సాంఘిక సంక్షేమశాఖ విడుదల చేసింది.