వ్యాపారం వైపు యువత ఆసక్తి

CAREER
CAREER

ఇపుడు కొత్త జనరేషన్‌ అంతా ఉద్యోగాలకంటే వ్యాపారం పెట్టుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వయం ఉపాధి ద్వారా ఉన్నత శిఖరాలు అదిరోహించాలని చూస్తున్నారు. దీనికి చేతిలో లక్షల రూపాయలు ఉండక్కరలేదు. ఒక ఐడియా చాలు జీవితాన్ని మార్చడానికి . ఐడియా ఉంటే పెట్టుబడి దారులు వెతుక్కుంటూ వస్తున్నారు.ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ ఈ రోజుల్లో అతి పెద్ద ఉపాధి అవకాశంగా మారింది ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో ప్రయోజనాలు ఎక్కువే, అదే సమయంలో రిస్క్‌ కూడా ఉంటుంది. ఒకప్పుడు ధనవంతులు కుటుంబాలే వ్యాపారాలపై మొగ్గు కనబరిచేవి. కొన్ని సందర్భాల్లో ఉపాధి లభించని వ్యక్తులు ఆకరు ప్రయత్నంగా ఇటువైపు కదిలేవారు అయితే ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకుని జీవనపోరాటంలోకి అడుగిడుగుతున్న కొత్త తరం కూడా స్వయంగా ఉపాధి పొందేందుకు ఆసక్తి కనబరుస్తోంది. కోఫౌండర్స్‌గా ముందుకు వస్తున్నారు. కుటుంబ ఆర్థిక స్థోమతను అంతగా లెక్కలోకి తీసుకోవటం లేదు. మరోవైపు విద్యా సంస్థలు విద్యార్ధులను ఎంట్రపెన్యూర్‌షిప్‌వైపు ప్రోత్సాహిస్తున్నాయి. ఇంక్యుబేటింగ్‌ వెంచర్లను ప్రత్యామ్నాయంగా చూపడమే కాదు, తమ విద్యార్థులు ఎంత మంది అటువైపు వెళ్లారో గ్రాడ్యుయేషన్‌ ఫంక్షన్లలో సగర్వంగా వెల్లడిస్తున్నాయి. ఆశ్చర్యకరం అనిపించినప్పటికి ఇది ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్‌ ఈ మార్పునకు కారణం ఏమిటి అన్నది తెలుసుకోవాల్సి ఉంది.ప్రస్తుత మిలీనియల్స్‌ (2000 సంవత్సరం ప్రాంతంలో పుట్టినవారు) దృక్కోణంలెనే మార్పు కనిపిస్తోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త స్నేహితులను కూడగట్టుకోవాలి. సరికొత్త నైపుణ్యాటు నేర్చుకోవాలి. ఎక్కవ మందికి ఉపకరించేలా పని చేయాలి. పనిపరంగా సంతృప్తి చెందాలి. అవన్నీ కొత్త అవకాశాల ద్వారా పొందాలని ఈ తరం చాశిస్తోంది. 1960 తరవాత వచ్చిన మార్పుల్లో భాగమే ఇది అంతే కాకుండా ఈ తరం సామాజికంగా వివేచన కలిగి ఉంటందన్నది ఒక పరిశోధనలో వెల్లడైన వాస్తవం. తనేమిటో నిరూపించుకోవాలన్న తహతహ ఈ కొత్త తరంలో కనిపిస్తోంది.అన్పింటికి మించి తాము ఏమిటో నిరూపించుకోవాలన్న ఆకాంక్ష మిలీనియల్స్‌లో కనిపిస్తోంది. అది కెరీర్‌ ఆరంభలోనే తమ ప్రతిభ కనబరచాలని కూడా భావిస్తున్నారు. పాత తరం సంస్థలను ఒకసారి పరిశీలిస్తే శిక్షణ కొన్నాళ్లు పని చేయటం, అనుభవం గడించడం,ప్రమోషన్లు సంతృప్తి పర్చడంలేదు. ఆదిలో పేర్కొన్నట్టు కాలుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించాలనేది ఈ తరం యువత వైఖరి ఎప్పుడో గుర్తింపు వస్తుందంటే వినే తరం కాదిది గుర్తింపులో జాప్యాన్ని సహించడం లేదు. వారసత్వం, అంచెలంచెలుగా ఎదగడం, శిఖర స్థానానికి చేరుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. సత్ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.స్టార్టప్‌ ఎకో సిస్టమ్‌ ఆరంభమైంది. రెండు దశాబ్దాలుగా పద్ధతిగా ఈ సిస్టమ్‌ ఎదుగుతోంది.రిస్క్‌ తీసుకుని మరీ సరికొత్త ఆలోచనలపై పెట్టుబడి పెట్టేందుకు ఇన్వెస్టర్లు కూడా ముందుకు వస్తుండటం విశేషం. ఆలోచనలను కేవలం లాబాపేక్ష దృష్టితోనే చేడటం లేదు సమాజంపై చూపే ప్రభావాన్ని కూడా అంచనా వేసున్నారు.మార్కెట్‌లో తెస్తున్న మార్పును కూడా చేస్తున్నారు. సరిగ్గా ఈ మార్పు మిలీనియల్స్‌కు అవకాశాలను కలుగజేస్తున్నాయి. అడ్డంకులను అధిగమించేందుకు ఈ జోనే వారికి తోడ్పడుతోంది. అపజయం ఎదురైనా వెనకడుగు వేయటం లేదు. ఆ అనుభవం బహుళ అవకాశాలు పొందే వీలు కలిగిస్తోంది. ఎంట్రప్రెన్యూర్‌షిప్‌తో పొందు నష్టాలను అధిగమించడం ఔత్సా హికులకు సులువుగా మారింది. తదుపరి రోజుల్లో మరింత ఉత్సాహ ంగా, ఇంకో కొత్త ఆలోచ నతో రంగంలోకి దిగుతు న్నారు. యువత ఈ స్టార్టప్‌ ప్రక్రియ ఆర్ధిక వ్యవస్థలో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తోంది. స్టార్టప్‌ తమకు ప్రయోజనకరంగా మారిందా లేదా అన్నది తేల్చుకోవడానికి అయిదు నుంచి పదేళ్లకు మించదు. అంటే స్వల్పకాలిక వ్యవధిలోనే విషయం తెలుస్తుంది. చైతన్యం ఎప్పుడూ వెంట ఉంటుంది. ఈ క్రమంలో నేర్చుకోడానికి, ప్రయోగాలు చేయడానికి అవకాశాలు ఇబ్బడి ముబ్బడిగా పెరుగు తున్నాయి. సంతృప్తికి అవకాశం ఉంటోంది. అనుభవం వస్తోంది.సదరు అనుభవమే వ్యక్తిని విజతీరాల వైపు నడిపిస్తోంది.మొతానికి స్టార్టప్‌ అను ఈ ప్రయోగంతో మిలీనియల్స్‌ సరికొత్త ఆర్థిక వాతావరణానికి, వ్యవస్థలో సమూల మార్పులకు రోహదపడుతోంది.