వెక్ట‌ర్ కంట్రోల్ రీసెర్చ్ సెంట‌ర్‌లో ఉద్యోగాలు

VCRC
VCRC

ఐసిఎంఆర్‌ ఆధ్వర్యంలోని వెక్టర్‌ కంట్రోల్‌ రీసెర్చ్‌ సెంటర్‌- తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు: 13
పోస్టులు – ఖాళీలు: సైంటిస్ట్‌ సి 1, సైంటిస్ట్‌ బి 2, ప్రాజెక్ట్‌ అసిస్టెంట్‌ 4, ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ 6
అర్హత: సైంటిస్ట్‌ పోస్టులకు 60 శాతం మార్కులతో పీజీ (లైఫ్‌ సైన్సెస్‌) పూర్తిచేసి ఉండాలి లేదా 50 శాతం మార్కులతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణతతోపాటు పిహెచ్‌డి (లైఫ్‌ సైన్సెస్‌/ పబ్లిక్‌ హెల్త్‌ ఎంటమాలజీ / మాలిక్యులర్‌ బయాలజీ) చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో రెండు నుంచి నాలుగేళ్ల అనుభవం ఉండాలి.
అసిస్టెంట్‌ పోస్టులకు డిగ్రీ (బయోలాజికల్‌ సైన్స్‌) ఉత్తీర్ణతతోపాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. ప్రాజెక్ట్‌ టెక్నీషియన్‌ పోస్టులకు ఇంటర్‌ ఉత్తీర్ణతతోపాటు పబ్లిక్‌ హెల్త్‌/ బయో మెడికల్‌ విభాగాల్లో రెండు నుంచి అయిదేళ్ల అనుభవం ఉండాలి. లేదా బిఎస్సీ/ రెండేళ్ల డిప్లొమా (మెడికల్‌ ల్యాబొరేటరీ) పూర్తిచేసి ఉండాలి
వయసు: పోస్టును అనుసరించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి
కాంట్రాక్ట్‌ వ్యవధి: ఏడాది
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 5
వెబ్‌సైట్‌: www.vcrc.res.in