విద్యుత్ శాఖ‌లో కొలువుల జాత‌ర‌

Electricity Department
Electricity Department

హైద‌రాబాద్ః విద్యుత్తు శాఖలో కొలువుల జాతర మొదలు కానుంది. మరో మూడు నెలల్లో దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌)లో 3,010 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేయనుంది. ఇప్పటికే ఆయా ఉద్యోగాల భర్తీపై స్పష్టత వచ్చినప్పటికీ ట్రాన్స్‌కో ఉద్యోగాలపై హైకోర్టులో వివాదం ఉండటంతో నోటిఫికేషన్‌ ఆగిపోయింది. ఓపెన్‌ కాంపిటేషన్‌ ఉద్యోగాలపై నిరుద్యోగులు కేసు వేసిన విషయం తెలిసిందే. న్యాయవివాదం తేలగానే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి ప్రకటించారు. 2,440 జూనియర్‌ లైన్‌మెన్‌(జేఎల్‌ఎం), 500 ఎల్‌డీసీ(లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌), 70 జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ (జేఏవో) ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. మూడు నెలల్లో ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదలవుతుందని గుర్తు చేశారు.