రేపు తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష

EAMCET
EAMCET Exam

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌-2018 పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. జెఎన్టీయు-హెచ్‌ ఆధ్వర్యంలో 87 కేంద్రాల్లో కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తారు. హాల్‌ టికెట్ల డౌన్‌లోడ్‌కు నేడే ఆఖరు తేదీ. తెలంగాణ,ఆంధ్రప్రదేశ్‌లో పలు జోన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం రెండున్నర లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు.