ప్రతి ప్రయత్నమూ విజయ మార్గమే

Way to success
విజయం ఓ వ్యవసనం కావాలి విజయానికి సూత్రాలు లేవు – ప్రతి లక్ష్యమూ విశిష్టమే విజయానికి మాత్రలు లేవు – ప్రతి మార్గమూ కొత్తే ప్రతి ప్రయత్నమూ విజయ మార్గమే కలలు కంటూ కూర్చుంటే కరిగిపోయేది కాలమే కాని మనం కలగంటున్నది జరిగి మన దగ్గరకు రాదు. కలలు సుఖమైన ఊహనిస్తాయి. కానీ వాస్త వం కష్టాన్ని కోరుతుంది. ఆ కష్టం నుండే విజయం పుడుతుంది. అటువంటి విజయంలో అనందం లభిస్తుంది. మనలో అలసత్వం ఎక్కువ. ఏదైనా పని ప్రరాంభిం చినపుడు తెగ ఆవేశంగా ప్రారంభించి క్రమేపి దాని గురించి పట్టించుకోవడం మానేస్తాం. అప్పుడు లక్ష్యసాధన దాదాపు అసంభవమే. ఓ పరీక్షకి అప్తై చేయ డంలో ఉన్నంత ఉత్సాహమూ, ఆసక్తీ ప్రిపరేషన్‌లో లేకపోవడం వల్ల అనుకున్న ఫలితం రాదు. చివరి నిమిషంలో ఏదో అదృష్టం పరిస్తుందనో, కలిసి వస్తుందనో అనుకోవడం  మూమూలే. కానీ ఇవన్నీ మన అపోహలే. మన అల సత్యానికీ, పలాయన వాదానికీ నిదర్శనాలే జీవితంలో ఏదైనా సాధిం చాలనుకోవడం ఒక ఎత్తు కలలు ఎవరైనా కంటారు. వాటిని సాకారం చేసు కోవ డమే కీలకం. ఈనాటి ప్రపంచంలో తీవ్రమైన పోటీ ఉందన్నది తిరుగులేని వాస్తవం. పక్క వారి కంటే మనలో పస ఏ మాత్రం తక్కువున్నా అవకా శాలు మన పక్కకిరావు. అయితే లక్ష్యాన్ని ఎంచు కోవడంలోనూ, దాన్ని సాధించు కోవడంలోనూ తీవ్రస్థాయి ప్రయత్నం జరగాల్సి ఉంటుంది. లక్ష్యా న్ని నిర్ణయిం చుకొని నిమ్మళంగా కూచుంటే ఏమైనా జరుగుతుంది. కాని అనుకున్నది మాత్రం జరగదు. లక్ష్యాన్ని వేటాడాలి. వేటసాగేటప్పుడు ఉండే పరిస్థితులన్నీ లక్ష్యసాధన మార్గంలో ఉంటాయి. వాటన్నిటిని అధిగమిస్తూ సాగితేనే విజయం. ఏ మాత్రం బెసికినా గురితప్పుతుంది. లక్ష్యం కను మరుగవుతుంది. కెరీర్‌ అభివద్ధిలో ఇటుం వంటి సాధన అత్యవసరం. మన శక్తియుక్తులు, మన మేధ, మన జ్ఞాన విజ్ఞానాలు మన కెరీర్‌ ఎంపికలో సహాయపడాలి. ఒక్కసారి లక్ష్య నిర్ధారణ ఒరిగాక ఇక వెనిక్క తిరిగి చేసే అవసరమూ, అవకాశమే రాకూడదు. లక్ష్యమన్నది ఎంత చిన్నదైనా, ఎంత గొప్పదైనా సరే, దాన్ని సాధించడానికి మాత్రం సర్వశక్తులూ ఒడ్డవలసి ఉంటుంది. ఎన్ని అవాంత రాలు ఎదురైనా ఎదుర్కొనే స్థైర్యం కావలసి ఉం టుంది. ఎన్ని ప్రలోభాలు పక్కతోవ పట్టించే ప్రయ త్నాలు చేసినా నిదొక్కుకునే మనోనిబ్బరం కావాల్సి ఉంటుంది.

ఇవన్నీ సమకూరాక సత్ఫలితం సులభంగా చేకూరతుంది. ఒకవేళ అనుకున్న ఫలితం రాక పోయినా కూడా మానసికంగా కుంగిపోని విధంగా తయారవుతాం. మరో లక్ష్యాన్ని ఎంచుకొని ముందు కు సాగే గుణాన్ని అలవర్చుకుంటాం. మరి ఇటు వంటి ఉన్నత లక్షణాలని అలవర్చుకునేదెలా? పరి శీలన, అవగాహన, ప్రణాళిక, ఆచరణ, ఈ అంశా లే మన వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడంలో ఉపకరిస్తాయి. మన భవిష్యత్‌ కెరీర్‌ ఉన్నతికి తోడ్పడతాయి. మన దృష్టిలో సక్సెస్‌ఫుల్‌ వారినీ, వారి జీవితాన్నీ పరిశీలించడంలో, విజయం కోసం వారుపడ్డ కష్టాలు, శ్రమ తెలుస్తాయి. మనం అనుకున్న గమ్యాన్ని, ఎంచుకున్న లక్ష్యాన్ని గురించి సరైన అవగాహన ఏర్పర్చుకోవాలి. ప్రతి విషయం గురించీ మనకు తెలియాల్సిన అవసరం లేక పోయినా, తెలియకపోతే నేరం కాకపోయినా కూడా తెలుసుకోవడం లాభదాయకం అవుతుంది. ప్రత్యే కించి మనది కాబోయే అంశంపై సంపూర్ణ అవగా హన ఉండటం వలన అసలు ఆ లక్ష్యం మనకి తగునా? లేక మనం దానికి సరిపోతామా? దాని వలన లాభాలు, నష్టాలు వంటి విషయాలు అవ గతమవుతాయి. గమ్యం గురించి అవగాహనంలూ ఏర్పడ్డాక దాన్ని చేరే మార్గాన్ని నిర్థారించుకోవాలి. దీనికి ప్రణాళిక అవసరం. ప్రణాళిక రచించ డానికి  జ్ఞానంతో పాటు లైక్యం కూడా అవసరం. ఈ ప్రక్రియలోనే లాభ నష్టాలు బేరీజు వేసుకోవాలి. అసలు ప్రయత్నం అవసరమా కాదా అనే అం శం దగ్గర నుండి లక్ష్యాన్ని ఎంత సమర్థవంతంగా చేధించగలమో నిర్ణయించు కోవాలి. అటువంటి బ్లూప్రింట్‌ పూర్తయ్యాక ఇక దాన్ని ఆచరించడమే మిగిలింది. అసలు ప్రాక్టికల్‌ సమస్యలు ఈ దశలో మొద లౌతాయి. ఇంతకు ముందు మన ఊహకు రానివీ, అంచనాకు అందనివీ ఇప్పుడు కళ్లెదుట కని పిస్తాయి. కొన్ని సార్లు మనం ఎంతో కష్టమనుకున్నది నిజానికి సులువుగా ఉండవచ్చు. ఓస్‌ ఇదే ముందిలే అనుకున్నది అడుగు ముందుకు సాగని వ్వక పోవచ్చు. అయినా సరే ప్రణాళిక ప్రకారం పోగలిగితే విజయం దగ్గర కొస్తుంది. విజయం శిఖరంపై నుండి వెనక్కి తిరిగి చూసుకుంటే కష్టాలు కనిపించవు. శ్రమ కనిపించదు.

అంతా సాఫీగా అందంగా, ఆనందంగా అగుపిస్తుంది. ఆ శిఖరం పైనుండే భవిష్యత్తు రంగు లమయంగా ఉంటుంది. ఇక అటువంటి శిఖరాలు మనకి మామూలు మెట్లవుతాయి. అటువంటి సవాళ్లు ఆహ్వానా లౌతాయి. ఇంతకు ముందే చెప్పినట్టు, అప్పుడు విజయం జీవన విధాన మౌతుంది. విజయం మ్యసనమౌతుంది. అటువంటి వ్యవసానికి బానిస లౌదాం. నష్టం లేదు.