పోలీసు పోస్టుల భర్తీ మలి అంకానికి ఏర్పాట్లు పూర్తి

telangana police
telangana police

డిసెంబర్‌ 17వ తేదీ నుంచి పిఇటీ పరీక్షలు…డిసెంబర్‌ 9 నుంచి 15వ తేదీ వరకు హాల్‌ టికెట్ల జారీ
హైదరాబాద్‌: తెలంగాణ పోలీసు శాఖలో సివిల్‌, సాయుధ బలగం, ఎస్‌పిఎఫ్‌, స్పెషల్‌ పోలీస్‌, ఫింగర్‌ ప్రింట్‌ బ్యూరో, రవాణా శాఖ, టెక్నికల్‌ విభాగంలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, కానిస్టేబుల్‌ తత్సమాన పోస్టుల భర్తీ మలి అంకానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేహదారుడ్య పరీక్షలతో పాటు, క్రీడాంశలకు సంబంధించిన పరీక్షలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇం దుకోసం హైదరాబాద్‌లో నాలుగు, వరంగల్‌లో రెండు మైదానాలు, ఇతర చోట్ల ఒక్కో మైదానం సిద్దం చేశారు. కాగా ఈ పరీక్షల కోసం ఎంపికైన అభ్యర్థులు ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి 15వ తేదీ అర్థరాత్రి 12 గంటల వరకు పోలీసు వెబ్‌సైట్‌ నుంచి తమ హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు వీలు కల్పించారు. ఒకవేళ హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేయలేక పోయిన వారు 9393711110 లేదా 9391005006 నంబర్లకు ఫోన్‌ చేసి హాల్‌ టికె ట్లను తీసుకునే అవకాశం కల్పించారు. కాగా హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్న అభ్యర్థులు పిఇటి పరీక్షలకు వచ్చే సమయంలో అన్ని నిబంధనలను పాటించాలని పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన ప్రాంతాలకు నిర్ణీత సమయాలలో రావాల్సి వుంటుందని వారు తెలిపారు. కాగా పార్ట్‌ 2 దరఖాస్తుల కోసం పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పాల్గొన్నారని బోర్డు అధికారులు తెలిపారు.