పరీక్షల వేళ టెన్షన్‌ లేకుండా..

                         పరీక్షల వేళ టెన్షన్‌ లేకుండా..

CAREER
CAREER

సంవత్సరారంభం నుంచి ఒక పద్ధతి ప్రకారం చదివే అలవాటున్న విద్యార్థులు పరీక్షల్ని నిశ్చింతగా ఎదుర్కొంటారు. ఒక్కొక్క సబ్జెక్టుకు కొద్దిరోజులు చొప్పున కేటాయించుకుని సిలబస్‌ అంతా ఒక ప్రణాళిక ప్రకారం చదవాలి. పరీక్షలు ఆరంభమయ్యే సమయానికి కనీసం మూడు సార్లయినా రివిజన్‌ చేయాలి. దీనివల్ల మనసులో స్పష్టత ఏర్పడుతుంది. కోర్సు ముగించేటప్పుడు ముఖ్యమనుకున్న అంశాలన్నీ సబ్జెక్టు ప్రకారం, పాఠం ప్రకారం విడిగా రాసుకోవాలి. ఇది పరీక్షల సమయంలో క్విక్‌రివిజన్‌కి పనికి వస్తుంది

పరీక్షలకు ఒక నెల నుంచి క్రమబద్ధంగా ప్రణాళిక వేసుకుని చదవండి. ప్రతినిముషం విలువైనదని గుర్తించండి. ఒక సబ్జెక్టు చదివి అలసిపోతే తేలికైన సబ్జెక్టు తీసి చదవండి. సబ్జెక్టు మారితే మళ్లీ కొత్త ఉత్సాహంతో చదవవచ్చు. మరీ అలసిపోతే 10,15 నిమిషాలు ప్రశాంతంగా గాలి బాగా తగిలే చోట నిశ్శబ్దంగా కూర్చోండి. ఆహారం, నిద్ర విషయంలో విధిగా వేళలను పాటించాలి.

చదివేటప్పుడు ఎప్పుడూ నోట్స్‌ దగ్గర ఉంచుకోవాలి. ఒక చాప్టర్‌ను చదవగానే అందులోని ముఖ్యాంశాలనూ పాయింట్ల వారీగా నోట్స్‌లో రాసుకోవాలి. ఏ సబ్జెక్టులో అయినా ప్రిన్సిపల్స్‌, కాన్సెప్ట్‌ను పూర్తిగా అవగాహన చేసుకోవాలి.దీనికోసం ఒకటికి రెండుసార్లు చదవాలి. ప్రతి చాప్టర్‌లో ఉండే ముఖ్యమైన పదాలు, అబ్రివేషన్స్‌, పాయింట్స్‌ను అండర్‌లైన్‌ చేసుకోవాలి.

జ కనీసం మూడు సంవత్సరాల ప్రశ్నాపత్రాల్ని నిశితంగా పరిశీలిస్తే ఏ అంశంలో ఎంత లోతుగా, ఏ రకంగా సిద్ధపడాలో అర్థమవ్ఞతుంది. మోడల్‌ పేపర్లను ప్రాక్టీసు చేయటం అవసరం. మోడల్‌ పేపర్లు నిర్ణీత సమయంలో రాయటం అలవాటు చేసుకోండి. ఇంటి వద్ద గడియారం చూసుకుని సరైన టైం ప్రకారం పరీక్ష పేపర్లకు జవాబు రాస్తే, పబ్లిక్‌ పరీక్షల్లో భయం ఉండదు. మీపై మీకు విశ్వాసం పెరుగుతుంది. ్జ చదివేటప్పుడు పాజిటివ్‌ ఆలోచనతో ప్రశాంతంగా ఉండాలి. పాఠ్యాంశాలను ఏకాగ్రతతో చదివి అవగాహన పెంపొందించుకోవాలి. చదువ్ఞకోవడానికి అనువ్ఞగా రూమ్‌లో మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి. సొంత కాలనిర్ణయ పట్టికను అనుసరించి ఆయా విషయాల్లో నేర్చుకున్న అంశాలను తెల్లకాగితంపై రాసి సరిచూసుకోవాలి.

సిలబస్‌లో ఉండే అన్ని చాప్టర్స్‌ను వాటి ప్రాముఖ్యాన్ని బట్టి విభజించుకుని వారానికి ఎన్ని టాపిక్స్‌ వస్తాయో గమనించి నిర్దిష్టమైన టైం టేబుల్‌ని తయారుచేసుకోవాలి. రివిజన్‌ కోసం కొన్ని వారాలు కేటాయించాలి. ఆదివారాలు మాత్రం టెస్ట్‌ల కోసం ప్రత్యేకించుకోవడం మరిచిపోకూడదు.

సరైన సమయంలో తగిన మోతాదులో పౌష్టికాహారం తీసుకొంటే విద్యార్థుల్లో చురుకుదనం పెరగడానికి వీలుంటుంది. సరిగా సిద్ధం కాని విద్యార్థులు ఆందోళన, ఒత్తిడికి గురయ్యే పరీక్షలు సమీపించే నాటికి సిచ్యుయేషనల్‌ డిప్రెషన్‌కు గురవ్ఞతారు. దీనివల్ల వారి పెర్ఫార్మెన్స్‌ మరింత దెబ్బతింటుంది.

పాఠాన్ని బట్టీపట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. ముందు ఆ పాఠంపై అవగాహన ఏర్పరుచుకోండి. పాఠం మొత్తాన్ని ఓ ఇండెక్స్‌లా మలచుకోండి. అంటే పాఠాన్ని చదివి, ప్రతి పేరాలోని ‘కీవర్డ్‌ని పట్టుకోండి. ఇలాంటి ‘కీవర్డ్‌ అన్ని వరుసగా పేర్చుకుని, గుర్తుపెట్టుకోండి. కీవర్డ్‌ గుర్తొస్తే ఆ పేరా అంతా గుర్తురావాలన్న మాట. పాఠాన్ని రెండుమూడుసార్లు రివైజ్డ్‌ చేసుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోండి. అందువల్ల మరచిపోకుండా పరీక్షల్లో చక్కగా ప్రెజంట్‌ చేయవచ్చు. మీకు కష్టంగా తోచిన సబ్జెక్టును ముందుగానే చదువ్ఞకోవాలి. ఏయే సబ్జెక్టులో వెనుకబడి ఉన్నారో వాటిపై ప్రత్యేక దృష్టి కనబరచాలి. అర్థరాత్రి వరకు చదవడం కన్నా తెల్లవారుజామున చదవడం మంచిది. కాపీలపై ఆధారపడటం మాని, కష్టపడి చదవడం ప్రారంభించాలి.

 చదవడం అంటే కేవలం పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా వార్తాపత్రికలు, మేగజైన్లు వంటివి కూడా ఫాలో అవడం మంచిది. పరీక్షల్లో అవసరమైన సందర్భాలలో వీటిలో వచ్చిన అంశాలనూ రాస్తే ఎగ్జామినర్‌ ఇంప్రెస్‌ అవ్ఞతారు. ఒక్క సబ్జెక్టుకు సంబంధించి ప్రశ్నలకు నోట్స్‌ను మీ సొంత వాక్యాల్లో రాసుకుని చదివితే మంచిది. పరీక్షలో కూడా ఇదేవిధంగా రాస్తే సమాధాన పత్రం అందరిలోకి భిన్నంగా కనిపిస్తుంది. తప్పులు దొర్లకుండా చూసుకోవడంతో పాటు సమయపాలన కూడా పాటిస్తే ఫైనల్‌ పరీక్షలు జంకులేకుండా ఆత్మవిశ్వాసంతో అవలీలగా రాసి అనూహ్యమైన ఫలితాలు సాధించవచ్చు. 

వ్యాసంగాని, జవాబులు గాని చాలా పెద్దవిగా ఉంటే దానిని భాగాలుగా విడగొట్టుకుని చదివితే గుర్తించుకోవడం సులభం అవ్ఞతుంది. చదవడానికి ఒక కాలక్రమ నిర్ణయ పట్టిక టైమ్‌ టేబుల్‌ తయారుచేసుకోవాలి. ఏకధాటిగా ఒకే సబ్జెక్టుకు ప్రాధాన్యం ఇవ్వకుండా సబ్జెక్టులు మార్చి మార్చి చదివేటట్లు తయారుచేసుకోవాలి.

ప్రతి అధ్యయనంలోని ముఖ్య భావన లేవో ఒక చిన్న నోట్‌ పుస్తకంలో రాసుకోవాలి. ఒక పట్టికలో కూడా రాసి మీరు చదువ్ఞకునే గదిలో గోడకు అతికించండి. వీలైతే భావనలు పదేపదే చూడండి.

చదివేటప్పుడు ఏకాగ్రత అవసరం. తర్వాత పాఠ్యాంశం చదువబోయే ముందు చదివిన పాఠ్యాంశాన్ని మళ్లీ ఒకసారి చదవాలి. చదివేటప్పుడు ఎర్ర ఇంకుపెన్నుగానీ, చేతిలో ఉంచుకుని ముఖ్యమైన విషయం క్రింద పెన్నుతో గీత గీయాలి.

మోడల్‌ పేపరు తయారుచేసి మీ పెర్‌ఫార్మెన్స్‌ను ఎవరితోనైనా ఎవాల్యుయేట్‌ చేయించుకోవడం మంచిది. పదిసార్లు చదవడం కంటే రెండుసార్లు రాయడం అలవరచుకుంటే జ్ఞాపకశక్తి అభివృద్ధి అవ్ఞతుంది. వీలుంటే సహవిద్యార్థితో చర్చించి కొత్తవిషయాలు నేర్చుకోవాలి. ఇద్దరు ముగ్గురు కలిసి చదవడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. చదివిన అంశాన్ని ఒకరికొకరు చెప్పుకోవడం వల్ల బాగా గుర్తుంటుంది. ్జ

క్వశ్చన్‌ పేపర్‌ మోడల్‌, మార్కుల విభజన తెలుసుకోవడానికి 4,5 సంవత్సరాల పేపర్లు సేకరించి వాటిలోని ప్రశ్నలను టాపిక్‌ల వారీగా వేరుచేయాలి. దీనివల్ల ఏ చాప్టర్‌లో ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో ఏవి ఎక్కువగా రిపీట్‌ అవ్ఞతున్నాయో, ఏ చాప్టర్‌లో ఎస్సే టైప్‌, ఎందులో షార్ట్‌ ఆన్సర్‌ టైప్‌ ప్రశ్నలు అడుగుతున్నారో తెలుస్తుంది. ఇలా ఒక లిస్ట్‌ తయారుచేసుకుని వాటిని సమాధానాలు రాసిపెట్టుకోవాలి. ఇద్దరు ముగ్గురు మిత్రులు కలిసి ఎక్స్‌పెక్టెడ్‌ క్వశ్చన్‌తో మోడల్‌ పేపర్స్‌ వేరువేరుగా తయారుచేసుకుని వాటన్నిటిని ప్రాక్టీస్‌ చేయడం ఎంతో అవసరం. ్జ

పరీక్షలు సమీపిస్తున్నందున అతి ముఖ్యమైన పాఠ్యాంశాలను ఎన్నుకుని చదివి విషయ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. దీన్నంతా పరీక్షలకు ముందు పునశ్చరణ చేసుకుని పూర్తిగా సన్నద్ధమయితే మంచిది. ఎటువంటి సందేహం ఎదురైనా సంబంధిత ఉపాధ్యా యుడి వద్దకూ వెళ్లి నివృత్తి చేసుకోవాలి. మార్కుల కోసమే అన్నట్లుగా కాకుండా విజ్ఞానాన్ని పెంచుకునే దిశగా చదవడం మంచిది. విద్యార్థులు పాజిటివ్‌గా ఆలోచించగలిగే విధంగా తల్లిదండ్రులు టీచర్లు మసలుకోవాలి. మార్కులకోసం చదవకుండా మన విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న లక్ష్యంతో చదవడం మంచిది.