నేటి నుంచి దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్‌

science fair
science fair

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌లోని సెయింట్‌ పాట్రిక్స్‌ హైస్కూల్‌ వేదికగా దక్షిణ భారత సైన్స్‌ ఫెయిర్‌ సోమవారం ప్రారంభం కానుంది. ఐదు రోజుల పాటు జరిగే ఈ సైన్స్‌ ఫెయిర్‌ను ఉప ముఖ్యమంత్రి కడియం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5గంటల వరకు నగరంలోని వివిధ పాఠశాలకు చెందిన విద్యార్థులు సైన్స్‌ఫెయిర్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం 5గంటల నుంచి 5:30గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించనున్నారు. ఈ నెల 12న జరిగే ముగింపు సమావేశానికి గవర్నర్‌ నరసింహన్‌ హాజరుకానున్నారు