త‌యారీ రంగంలో ఉచిత శిక్ష‌ణ‌

ap skill developement corporation
ap skill developement corporation

అనంత‌పురంః రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో పలు కోర్సులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ విన్సెంట్‌ తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. చిరుధాన్యాలతో ఆహార పదార్థాల తయారీ, హెర్బల్‌, ఆయుర్వేదిక్‌ ఉత్పత్తుల తయారీ, సబ్బులు, డిటర్జెంట్‌ పౌడర్‌ తయారీ, మగ్గం వర్క్‌, ఎం బ్రాయిడ్‌ వర్క్‌, పూలజడ అల్లకం, చీపు ర్ల తయారీ, శానిటరీ నాప్కిన్స్‌, పుట్టగొ డుగుల పెంపకం, జూటు బ్యాగులు, ఇత ర వస్తువుల తయారీపై ఉచిత శిక్షణ ఇ స్తున్నట్లు తెలిపారు. 20 నుంచి 45 సంవత్సరాలలోపు వయసున్న యువతీ, యువకులు దరఖాస్తు చేసుకోవచ్చన్నా రు.