జీఎస్టీతో ఆన్‌లైన్ ప‌రీక్ష‌ ఫీజుల మోత‌

online tests
online tests

హైద‌రాబాద్ః జీఎస్టీ కారణంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో నిర్వహించనున్న అన్ని సెట్‌ల ఫీజులూ పెరగనున్నాయి. తెలంగాణలో ఎంసెట్‌, ఈసెట్‌, ఐసెట్‌, పీజీఈసెట్‌, లాసెట్‌, పీజీసెట్‌, ఎడ్‌సెట్‌తోపాటు పలు రకాల సెట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వీటికి సుమారు 7-8 లక్షల మంది హాజరవుతారు. ఈ ఏడాది నుంచి అన్ని సెట్లను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. దాంతో, నిర్వహణ ఖర్చు భారీగా పెరగనుంది.