గురుకులాల్లో కెమిస్ట్రీ పోస్టులకు 16న ఇంటర్వూలు

Gurukula patasala
Gurukula patasala

హైదరాబాద్‌: సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖలకు సంబంధించిన గురుకుల కళాశాలల్లో డిగ్రీ కెమిస్ట్రీ లెక్చరర్‌ పోస్టుల కోసం ఈనెల 16వ తేదీన ఇంటర్వూలు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సెక్రటరీ ఎ వాణీప్రసాద్‌ తెలిపారు. కెమిస్ట్రీ లెక్చరర్‌కు సంబంధించి 38 పోస్టులకు గాను 68 మందిని ఇంటర్వూలకు ఎంపిక చేసినట్లు వివరించారు. ఇంటర్వూకు హాజరయ్యే అభ్యర్థులు మంగళవారం నాడు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చారని వెల్లడించారు.