ఐసిఎంఆర్‌లో ఉద్యోగాలు

ICMR
ICMR

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) – కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఉద్యోగాలవారీ ఖాళీలు: అసిస్టెంట్లు 4, పర్సనల్‌ అసిస్టెంట్లు 3, అప్పర్‌ డివిజన్‌ క్లర్కులు 64
అర్హత: అన్ని ఉద్యోగాలకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అసిస్టెంట్లకు ఎంఎస్‌ ఆఫీస్‌ / పవర్‌ పాయింట్‌ పరిజ్ఞానం ఉండాలి. పీఏలకు హిందీ / ఇంగ్లీష్‌ షార్ట్‌హ్యాండ్‌లో నిమిషానికి 120 పదాల వేగం ఉండాలి. యూడీసీలకు నిమిషానికి 35 ఇంగ్లీష్‌ పదాలు లేదా 30 హిందీ పదాల టైపింగ్‌ వేగం ఉండాలి.
వయసు: దరఖాస్తు నాటికి అసిస్టెంట్లకు 30 ఏళ్లు మించరాదు. యూడీసీలకు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అభ్యర్థులను ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ రిటెన్‌ టెస్ట్‌, కంప్యూటర్‌ నాలెడ్జ్‌ టెస్ట్‌, టైప్‌ టెస్ట్‌ ద్వారా ఎంపిక చేస్తారు. రిటెన్‌ టెస్ట్‌లో అర్హత పొందాలంటే జనరల్‌ ్క్ష ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం, ఇతర రిజర్వుడు వర్గాలవారికి 40 శాతం మార్కులు రావాలి. కంప్యూటర్‌ & టైప్‌ టెస్టుల్లో అర్హత పొందితే చాలు.
ఆన్‌లైన్‌ టెస్ట్‌ వివరాలు: ఈ పరీక్షను హిందీ / ఇంగ్లీషు మాధ్యమాల్లో నిర్వహిస్తారు. పరీక్ష సమయం 2 గంటలు. జనరల్‌ ఇంగ్లీష్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌, జనరల్‌ నాలెడ్జ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి ప్రశ్నలు అడుగుతారు. పదోతరగతి స్థాయిలోనే ప్రశ్నలు అడుగుతారు. మొత్తం మార్కులు 200. ఒక్కో ప్రశ్నకు1 మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోతవిధిస్తారు. ఈ పరీక్షలో అర్హత పొందినవారిని మాత్రమే తరవాతి టెస్టులకు అనుమతిస్తారు.
వయసు: 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 4 నుంచి
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: జూలై 9
దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు ఆఖరు తేదీ: జూలై 10
వెబ్‌సైట్‌: www.icmr.nic.in