ఐడిబిఐ బ్యాంక్‌లో ఉద్యోగాలు

IDBI
IDBI

ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఐడిబిఐ) నుంచి భారీ నోటిఫికేషన్‌ విడుదలైంది. కేవలం డిగ్రీ అర్హతతో ఎగ్జిక్యూటివ్‌ కేడర్‌ పోస్టును సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులకు ఇది సువర్ణావకాశం.
తాజా నోటిఫికేషన్‌ ద్వారా కాంట్రాక్ట్‌ బేసిస్‌ మీద మొత్తం 760 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో జనరల్‌ అభ్యర్థులకు 296, ఒబిసిలకు 202, ఎస్సీలకు 122, ఎస్టీలకు 56, దివ్యాంగులకు 84 పోస్టులను కేటాయించారు. కాంట్రాక్ట్‌ వ్యవధి ఏడాది అయినప్పటికీ ఏటా పొడిగిస్తూ మరో రెండేళ్ల వరకు కొనసాగిస్తారు. ఈ మూడేళ్ల కాంట్రాక్టు వ్యవధి పూర్తిచేసుకున్న అభ్యర్థులకు అసిస్టెంట్‌ మేనేజర్‌ (గ్రేడ్‌ – ఎ) పోస్టుకు ఎంపికయ్యే అవకాశం ఉంటుంది.
వేతనం: మొదటి ఏడాది నెలకు రూ.17,000 రెండో ఏడాది రూ.18,500 మూడో ఏడాది రూ.20,000 చెల్లిస్తారు.
అర్హత: దరఖాస్తు నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజర్వుడు వర్గాలకు 55 శాతం మార్కులు వస్తే చాలు. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
వయసు: జనవరి 1 నాటకి 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైనవారికి వయోపరిమితి సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్‌, డాక్యుమెంట్స్‌ వెరిఫికేషన్‌, ప్రీ రిక్రూట్‌మెంట్‌ మెడికల్‌ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ టెస్ట్‌ వివరాలు: అభ్యర్థులు గంటన్నర సమయంలో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. రీజనింగ్‌, ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ విభాగాల్లో ఒక్కోదాని నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఇంగ్లీష్‌ లాంగ్వేజ్‌ మినహా మిగిలిన అన్ని టెస్టులకు సంబంధించిన ప్రశ్నలను హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో ఇస్తారు. నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంది. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు కోత విధిస్తారు. ప్రశ్నకు సమాధానం గుర్తించని పక్షంలో ఎటువంటి కోత విధింపు ఉండదు. బ్యాంక్‌ నిర్ణయం మేరకు ఆన్‌లైన్‌ టెస్టులో అర్హత పొందినవారికి తదుపరి ఎంపిక ప్రక్రియలు నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నం
ముఖ్య సమాచారం
దరఖాస్తు ఫీజు: రూ.700(ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు రూ.150)
ఆన్‌లైన్‌ టెస్ట్‌ కోసం కాల్‌ లెటర్స్‌ డౌన్‌లోడింగ్‌: ఏప్రిల్‌ 17 తరవాత
ఆన్‌లైన్‌ టెస్ట్‌ జరుగు తేదీ: ఏప్రిల్‌ 28
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు ఆఖరు తేదీ: ఫిబ్రవరి 28
వెబ్‌సైట్‌: www.idbi.com