ఎఫ్ఆర్ఓ ప‌రీక్ష ప్రిలిమిన‌రీ కీ విడుద‌ల‌

telangana forest
telangana forest

హైద‌రాబాద్ః ఫారెస్టు రేంజ్‌ ఆఫీసర్‌(ఎఫ్‌ఆర్‌ఓ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాత పరీక్ష ప్రిలిమినరీ కీని వెబ్‌సైట్‌లో పొందుపర్చినట్లు టీఎస్‌పీఎస్సీ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 11-20 వరకు వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని ప్రకటనలో వెల్లడించారు. కాగా, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో భాగంగా ఫిజికల్‌ ఎఫీషియెన్సీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 12-15 వరకు సరోజినిదేవి కంటి ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించనున్నారు.