ఇక విడ‌త‌ల వారీ ఎంసెట్‌

Career
Career

హైద‌రాబాద్ః ఎంసెట్‌-2018ను విడతల వారీగా నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి వెల్లడించారు. విడతకు 30 వేల మంది చొప్పున 4 లేదా 5 విడతల్లో 2 లేదా 3 రోజులపాటు పరీక్ష నిర్వహిస్తామన్నారు. 2018-19 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రవేశ పరీక్షలనూ ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరయ్యే ఎంసెట్‌ను ఏ విధంగా నిర్వహించాలనే విషయమై సోమవారం ఉన్నత విద్యా మండలి సమీక్ష నిర్వహించింది. ఇందులో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.