ఇండియన్‌ జాగ్రఫీ ప్రత్యేకం


మృత్తికలు

CAREER
CAREER

భూమిపై జరిగే శిలాశైథిల్యం, జంతు, వృక్ష సంబంధ పదార్ధాలు కాలక్రమంలో అనేక భౌతిక, రసాయనికి మార్పులకు లోనై అనేక పరిణామాలు చెందుతూ ఏర్పడే సున్నితమైన పదార్దాన్ని ీమృత్తిక అంటారు లేదా భూ ఉపరితలంపై కర్బన, అకర్బన పోషకాలతో కూడి, వదులుగా ఉండే పొర/ నేలనే మృతిక అంటారు.మృతిక ఏర్పడటానికి ఆధార శిల అవసరం.

 • మృతికల భౌతిక, రసాయనిక ధర్మాలను లేదా నేలల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మృతికా శాస్త్రం అంటారు.
 • మృత్తిక సాధారణంగా 5 రకాల కారణాల వల్ల ఏర్పడతాయని రష్యా మృతికా శాస్త్రవేత డాకు చాయెల్‌ పేరొన్న్రారు. అవి 1) మాతృశిలలు 2) స్దానిక శీతోష్ణస్థితి 3) వృక్ష సంబంధ పదార్ధాలు 4) నైసర్గిక స్వరూపం 5) నేల వయసు
  సాధారణంగా క్షారనీయతలోని లవణాలను పిహెచ్‌ విలువలతో కొలుస్తారు.
 • తటస్థ నేల పిహెచ్‌ విలువ 6.5 నుంచి 7.5 వరకు ఉంటుంది.పిహెచ్‌ విలువ 7 కంటే తక్కువ ఉన నేలలను ఆమ్ల నేలలు, పిహెచ్‌ విలువ 7 కంటే ఎక్కువగా ఉండే నెలలనుక్షార నేలలు/ లవణీయత ఉన్న నేలలు/ చవుడు నేలలు అని పిలుస్తారు. -ఏర్పడే విధానాన్ని బట్టి మృతికలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు.
 1. స్థానబద్ధ మృతికలు: శిలా శైధిల్యం కాగా,ఆ మాతృశిలపైనే ఏర్పడిన మృత్తికలను స్థానబద్ధ మృతికలు అంటారు. ఉదా: నల్లరేగడి నేలలు, లాటరైట్‌ నేలలు, ఎర్ర నేలలు.
 2. నిక్షేపిత/ పరస్థానీయ మృత్తికలు: బహిర్జనిత బలాల కారణంగా శిధిలాలు రవాణా అయ్యి వేరొకచోట నిక్షేపితం చెందడం వల్ల ఏర్పడే నేలలు. ఉదా: ఒండ్రు మట్టి నేలలు.- ఓల్కర్‌ అనే శాస్త్రవేత్త మృతికలను 4 రకాలుగా వర్గీకరించాడు. అవి: 1) ఒండ్రు నెలలు 2) నల్ల రేగడి నేలలు 3) ఎర్ర నెలలు 4) జేగురు/లాటరైట్‌ నేలలు
  భారత వ్యవసాయ పరిశోధనా సంస్థ భారత దేశంలో నేలలను 8 రకాలుగా వర్గీకరించింది. అవి: 1)ఒండ్రు నెలలు2) నల్లరేగడి నేలలు 3) ఎర్ర నేలలు 4) లాటరైట్‌ నేలలు 5) క్షార నేలల 6) పర్వత ప్రాంత నేలలు 7) ఎడారి/ ఇసుక నేలలు 8)పీట్‌/ సేంద్రియ నేలలు
  ఒండ్రు నేలలు/ డెల్టా నేలలు:నదులు మెత్తని రేణు యుతఅవక్షేపాలనునిక్షేపించడంవల్ల ఏర్పడతాయి.
  -ఇవి అత్యంత సారవంతమైన, ఉత్పాదకత కలిగిన నేలలు.దేశం మొత్తం భూభాగంలో సుమారు 23-40 శాతం ఆక్రమించి ఉన్నాయి. ఉదా: గంగ- సింధూ డెల్టా, కృష్ణా డెల్టా, గోదా వరి డెల్టా, మహానది డెల్టా. దేశ వ్యవసాయ సంపదలో అధికభాగం ఒండ్రు మృతికల నుంచే లభిస్తోంది.ఈ మృతికలో అన్ని రకాల పంటలు పండుతాయి.ఉదా:వరి,గోధుమ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, పత్తి, జనుము మొదలైనవి.
  ఎర్రనేలలు: పూరాతన అగ్నిశిలలు, స్ఫటికాకార రూపాంతర ప్రాప్తి శిలలు, తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో శైధిల్యం చెందడం వల్ల ఎర్రనేలలు ఏర్పడతాయి. ఇవి ఎరుపువర్ణంలొ ఉండటానికి ప్రదాన కారణం ఆ మృత్తికల్లోని ఫెర్రస్‌ ఆక్సైడ్‌.ఇవి తేలికపాటి వయనంతో సచ్చి ద్రంగా, సులభంగా చూర్ణమ్యే విధంగా ఉంటాయి. ఇవి గాలి పారేలా ఉంటాయి.ఇవి దేశ విస్తీర్ణంలో అత్యధికంగా దాదాపు 29%అక్రమించి ఉన్నాయి. ఇవి ఆక్షిణ భారతదేశంలో అధికంగా ఆగ్నేయ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలలో కొన్ని ప్రాంతా ల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో పొటాషియం అధికంగా, నైట్రోజన్‌, ఫాస్పరస్‌, హ్యూమస్‌ తక్కువగా ఉంటాయి.ఈ వృతికల్లో నీరు తొందరగా ఇంకిపోతుంది. కాబట్టి నీటి పారుదల సౌకర్యాలు, ఎరువుల ఉపయోగం ద్వారా అన్ని రకాల పంటలు పండింవచ్చు.చిరుధాన్యాల ఉత్తపత్తికి ఈ నేలలు బాగా అనుకూలం.- నీటి పారుదల లేనిచోట వేరుశనగ, ఆముదాలు లాంటి నూనెగింజలను పండించవచ్చు.
  లవణ మృతికలు లేదా క్షారమృతికలు: ఇవి సారవంతమైనవి కావు. దేశ భూభాగంలో సుయారు 1.29% విస్తరించి ఉన్నాయి. ఉత్తర భారతదేశంలోని పొడి ప్రాంతాల్లో ఈ నేలలు ఎక్కువ. వీటిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు.- ఉదా: రేహ్‌, కల్లార్‌, యుసర్‌, దుర్గ్‌, కార్ల్‌, షోపాన్‌ మొదలైనవి.ఇవి పంటలు పండించడానికి అనుకూలమైనవి కావు,
  ఎడారి నేలలు/ఇసుక నేలలు: ఇవి అధిక లవణీయత లేదా క్షారత్వాన్ని కలిగి ఉంటాయి. జిప్సంను కలపడం ద్వారా ఈ నేలలను కొంత
  వరకుసారవంతం గా మార్చవచ్చు. దేశ భూభా గంలో సుమారు 8.46% విస్తరించి ఉన్నాయి. దేశ పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణలలో విస్తరించి ఉన్నాయి. -నీటిపారుదల ద్వారా బార్లీ, పత్తి చిరుధాన్యాలను పండించవచ్చు.
  పీట్‌/సేంద్రియ నేలలు: ఇవి నల్లని, బరువైన మృతికలు.నీరు ప్రవహించకుండా ఎక్కువ కాలం నిల్ల ఉండటం వల్ల ఈ నేలలు తేమ, బురదను కలిగి నల్లని రంగును సంతరించుకుంటాయి. ఇవి అత్యధిక సేంద్రియ పదార్ధాలను కలిగి ఉన్నప్పటికీ సాగుకు అనుకూలం కాదు. ఇవి అత్యధిక సేంద్రియ పదార్ధాలను కలిగి ఉన్నప్పటికీ సాగుకు అనుకూలం కాదు.ఇవి అత్యధిక కేరళ, ఉత్తరా ఖండ్‌లోని అల్మోరా ప్రాంతం, పశ్చిమ బంగా, ఒడిశాల్లో విస్తరించి ఉన్నాయి. కేరళలో వీటిని కరి నేలలు అనిపిలుస్తారు.
  మృత్తికా క్రమక్షయం: నదులు, వర్షాలు, వరదలు, గాలి లాంటి సహజ కారణాల వల్ల మెత్తని, సారవంతమైన మృతిక పైపొర కొట్టుకు పోవడాన్ని మృతికా క్రమక్షయం అంటారు. మృత్తి కా క్రమక్షయం వల్ల జరిగే ముఖ్య పరిణామాలు: 1)ఎడారిగా మారడం.2) జలాశయాల్లో పూడిక చేరడం 3) మృతికలు సారాన్ని కోల్పోయి నిస్సా రంగా మారడం. మన దేశంలో సుమారు 175 మి.హెక్టార్లులో జరిగే ఈ క్రమక్షయం వల్ల ఏటా సుమారు 6,000 మిలియన్‌ టన్నుల మృతికలు అంటే సగటున ప్రతి హెక్టారుకు 16.4టన్నులకు పైగా మృతిక కొట్టుకుపోతుంది. ఫలితంగా కలిగే పోషక పదార్ధాల నష్టం భూమిలోవాడే ఎరువుల కంటే అధికంగా ఉంది. ఇది ఏటా సుమారు 30 నుంచి 50 మి.టన్నుల పంట నష్టాన్ని కలిగి స్తుం ది.ఈ క్రమక్షయ ఫలితంగా నదులు, జలాశ యాలు ఏటా 1% నుంచి 2% వరక/ తమ నిల్వ సామర్ధ్యాన్ని కోల్పోయి పూడుకు పొతున్నాయి.
  మృతికా క్రమక్షయం మూడు రకాలు:
  1) పట క్రమక్షయం 2) వంక క్రమక్షయం 3) అవనాళికా క్రమక్షయం.
  పర్వత మృత్తికలు:ఇవి పూర్తిగా పరిణతి చెందని మృత్తికలు. తక్కువ సారవంతమైనవి. ఇవి దేశ భూభాగంలో సుమారు 10.64% వరకు విస్త రించి ఉన్నాయి.ఎక్కువగా పంజాబ్‌, కర్ణాటక, జమ్మూకశ్మీర్‌,మణిపూర్‌, నీలగిరి ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.ప్రధానంగా పండ్ల తోటలు, కాఫీ, తేయాకు, క్యాబేజీ, రబ్చరు, బంగాళ దుంపలు పండిస్తారు.
  నల్లరేగడి మృతికలు: అర్ధశుష్క పరిస్థితులు ఉండే దక్కన పీఠభూమి ప్రాంతంలో లావా, నీస్‌, గ్రానైట్‌ శిలలు లేదా బసాల్ట్‌ అగ్నిశిలలు శైథిల్యం చెందిడం వల్ల ఏర్పడతాయి.ఇవి అమెరికాలోని ప్రయరీ ప్రాంతంలో ఉన్న చెర్నోజమ్‌ నేలలను పోలి ఉండటం వల్ల చెర్నోజమ్‌ నేలలని పిలుస్తారు. వేసవిలో ఈ నేలలో పగుళ్లు ఏర్పడి, ఆ పగుళ్లలోకి పైనున్న మెత్తని మట్టి జారిపోయి వర్షాకాలంలో వాటంతట అవే జిగటగా మారికపోవడం వల్ల తమను తామే దున్నుకునే నేలలు అని కూడా పిలుస్తారు. బంకమన్ను ఉండటం వల్ల తేమను నిలుపుకునే సామర్ధ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి.దేశ విస్తీర్ణంలో సుమా రు 24% ఆక్రమించి ఉన్నాయి. దీనిలో సేంద్రియ పదార్ధాలు, నైట్రోజన్‌,ఫాస్ఫరస్‌ తక్కువగా, ఇనుము, పొటాష్‌, సున్నం అధికంగా ఉంటాయి. ఈ నేలలు పత్తిపంటకు ప్రసిద్ధి. దీనితోపాటు పొగాకు, మిరప, నూనెగింజలు, చెరకు మొదలై నవి పండుతాయి. ప్రధానంగా మహారాష్ట్ర మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కర్ణాటక, తెలంగాణలలో విస్తరించి ఉన్నాయి.
  లాటరైట్‌ నేలలు/ జేగురు నేలలు:అధిక ఉష్నోగ్రత (అనాద్ధ్ర), అధిక వర్షపాల (ఆర్ద్ర) శీతోష్ణసితి పరిస్థితులు ఏకాంతరంగా ఉండే పర్వతశిఖర, పీటభూమి ప్రాంతాల్లో ఈ నేలలు ఏర్పడతాయి. -వీటిని మొదటగా జార్జ్‌ బుకానన్‌ అనే శాస్త్రవేత్త మలబార్‌ తీరంలో గుర్తించాడు. ఈ నేలలు ప్రధానంగా సహ్యాద్రి పర్వత ప్రాంతాల్లో (పశ్చిమ కనుయల ప్రాంతం) కేరళ, కర్ణాటక, తమిళనాడులో, తూర్పు కనుమల ప్రాంతాల్లోని ఆంధ్రప్రదేశ్‌, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి.ఇవి దేశ విస్తీర్ణంలో సుమారు 4.30% ఆక్రమించి ఉన్నాయి. ఈ నేలలో ఆమ్లత ఎక్కు వగా ఉంటుంది.ఇవి తక్కువ సారవంతమైన నేలలే.ఈ మృతికలు తేనేపట్టులోని బుడిపేల మాదిరి ఇనుప ఆక్సైడ్‌లను కలిగి ఉంటాయి. మామూలు సమయంలో ఎరుపు వర్ణంలో ఉండే ఈనేలలు వర్షానికి తడిసినప్పుడు నల్లగా తయార వుతాయి.ఈనేలలు తేయాకు, కాఫీ, జీడిమామిడి, కొబ్బరి,రబ్బరులాంటి తోటపంటలకు అనుకూలం.