ఇండియన్‌ ఆర్మీలో ఆఫీసర్లు

Indian Army
Indian Army

 ఇండియన్‌ ఆర్మీషార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా టెక్నికల్‌ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అవివాహిత పురుష, మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. షార్ట్‌సర్వీస్‌ కమిషన్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ ఖాళీలసంఖ్య: 191,ఇందులో పురుషులు-175, మహిళలు-24, విభాగాల వారీగా ఖాళీలు: సివిల్‌-50, మెకానికల్‌-17, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌-24,ఏరోనాటికల్‌/ బాలిస్టిక్స్‌/ ఏవియానిక్స్‌-12, కంప్యూటర్‌సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌/ కంప్యూ టర్‌టెక్నాలజీ/ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ/ ఎమ్మెస్సి కంప్యూటర్‌సైన్స్‌-47, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ / టెలికమ్యూనికేషన్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ -25, ఎలక్ట్రానిక్స్‌ /ఆప్టో ఎలక్ట్రానిక్స్‌/ఫైబర్‌ ఆప్టిక్స్‌ / మైక్రో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ మైక్రోవేవ్‌-8,ప్రొడక్షన్‌ ఇంజినీరింగ్‌ -3, ఆర్కిటెక్చర్‌/ బిఇ/ బిటెక్‌ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరు అక్టోబర్‌ 1లోపు ఉత్తీర్ణులు కావాలి.వయోపరిమితి: 2019 అక్టోబర్‌7నాటికి 20 నుంచి 27సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు కనీసం 157. 5సెం.మీ ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువుండాలి. విడోస్‌ఆఫ్‌ డిఫెన్స్‌ అభ్యర్థులకు ఖాళీలు: ఉమెన్‌ ఎస్‌ఎస్‌సి-2, ఇందులో టెక్నికల్‌-1, నాన్‌టెక్నికల్‌-1, అర్హత: నాన్‌టెక్నికల్‌కు ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ,టెక్నికల్‌కు ఏదైనా బ్రాంచిలో బిఇ/బిటెక్‌ ఉత్తీర్ణులై ఉండాలి. వయోపరిమితి: అక్టోబర్‌ 7నాటికి 35 ఏండ్లు మించరాదు. పేఅండ్‌ అలవెన్సులు: ట్రైనింగ్‌లో నెలకు రూ.56,100/-జీతం ఉంటుంది. శిక్షణ పూర్తయ్యాక లెఫ్టినెంట్‌హోదాలో పేబ్యాండ్‌ రూ.56,100-1,77,500/- జీతం చెల్లిస్తారు. వీటికి అదనంగా గ్రూప్‌ ఇన్సూరెన్స్‌, ఇతర సౌకర్యాలు ఉంటాయి. శిక్షణ: ఆఫీసర్‌ ట్రైనింగ్‌ అకాడమీ చెన్నైలో అక్టోబర్‌ నుంచి 49 వారాల శిక్షణ ఉంటుంది. కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి ఆర్మీలో ఉద్యోగం కల్పిస్తారు.ఎంపికవిధానం: సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌, ఇంటర్వ్యూ/టెస్ట్‌ద్వారా, ఎస్‌ఎస్‌బి అర్హత కలిగిన అభ్యర్థు లను షార్ట్‌లిస్ట్‌చేసి, రెండు దశల్లో ఇంటర్వ్యూ / టెస్ట్‌లను నిర్వహిస్తుంది. ఇంటర్వ్యూ నిర్వహించే ప్రదేశం: ఎస్‌ఎస్‌బి సైకాలజికల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ / టెస్ట్‌లను వరుసగా ఐదారురోజులపాటు అలహాబాద్‌,భోపాల్‌, బెంగళూరు, కపుర్తలాలో నిర్వహిస్తారు. దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌లో, దరఖాస్తు ఆఖరుతేదీ: ఫిబ్రవరి 21