అనివార్య కార‌ణాల వ‌ల‌న ఫీజుల పెంపుః ఇంట‌ర్ బోర్డు

inter board secretary Ashok
inter board secretary Ashok

హైద‌రాబాద్ః ధరల పెరుగుదల, జీఎస్టీ, తదితర అనివార్య కారణాల వల్లే పరీక్ష ఫీజును, విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ఫీజులను పెంచాల్సి వచ్చిందని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ తెలిపారు. చివరిసారిగా 2007-08లో విద్యార్థుల రిజిస్ట్రేషన్‌ ఫీజును రూ. 75 నుంచి రూ. 85కు పెంచామని.. అప్పటినుంచి ఏటా రూ. 10 చొప్పున పెంచాల్సి ఉన్నప్పటికీ అలా చేయలేదన్నారు. దీంతో ఈ ఏడాది ఒకేసారి రూ. 85 నుంచి రూ. 200కు పెంచాల్సి వచ్చిందన్నారు. పరీక్ష ఫీజును కూడా 20శాతం పెంచినట్లు చెప్పారు. విద్యార్థులు చెల్లిస్తున్న ఫీజులను వారికి మెరుగైన సేవలందించేందుకు వినియోగిస్తామన్నారు. పెంచిన రిజిస్ట్రేషన్‌ ఫీజును తగ్గించాలని ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో అశోక్‌ ఈ మేరకు బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు.