అంబేద్క‌ర్ వ‌ర్సిటీలో ప్ర‌వేశాలు

ambedkar open university
ambedkar open university

హైద‌రాబాద్ః అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2018-19 డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్షకు నోటిఫికేషన్‌ వెలువడింది. ప్రవేశాల కోసం అభ్యర్థులు గురువారం నుంచి ఫిబ్రవరి 28 వరకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. పరీక్షలో ప్రతిభ ఆధారంగా బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశం లభిస్తుంది. అర్హత పరీక్షను మార్చి 11న నిర్వహిస్తారు. వివరాలకు www.braouonline.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలి.